౮౯7. ఆగపు 2025 గురువారము || మనుష్యులు చనిపోవుచున్నారు! జీవమిచ్చు దేవుని వాక్యము వారికిమ్ము
- Honey Drops for Every Soul

- Aug 7
- 2 min read
తేనెధారలు చదువుము : 2 తిమోతి 4:1-5
“.. నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్టలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవెర్చును” - యెషయా 55:11
రోగ పడక మీద ఉండిన ఒక స్తీ, ఆస్టేలియా నుండి తనకు వచ్చిన వస్తువులు పెట్టి పంపిన ఒక పెట్టకు చుట్టి ఉన్న కాగితంలో ఉన్న మాటలు చదివి తాను రక్షింపబడితినని సాక్ష్యమిచ్చెను. ఆ నలిగిపోయిన కాగితంలో ఆంగ్ల బోధకుడైన సి. హెచ్. స్పర్దన్‌గారి ప్రసంగం ఉన్నది. అది ఇంగ్రండులో బోధింపబడి, అమెరికాలో అచ్చు వేయబడి, ఆ(స్టైలియాకు పంపబడగా అక్కడనుండి అది వస్తువులకు చుట్టి తిరిగి ఇంగ్లండుకు పంపబడగా, లండన్‌లో ఎక్కడైతే మొదట ప్రసంగింపబడినదో అక్కడే ఒక అమూల్యమైన ఆత్మ రక్షింపబడుటకు అదియే కారణమైనది ! అదియే దేవుని వాక్యశక్తి. ఆ కాగితం మీద ఉన్న స్పర్దనుగారి మాటలు కాదుగానీ సజీవమైన దేవుని వాక్యమే ఆ ప్రీ ఆత్మను రక్షించినది ! కావున మనము దేవుని వాక్యములు ఏ కైస్తవ కూడికలోనైనను లేక ప్రతిదినము మన తోడి పనిచేయువారికైనను, ఇరుగు పొరుగు లేక
స్నేహితులకైనను ప్రకటించినప్పుడు దేవుడు ఉద్దేశించిన కార్యము నెరవేర్చకుండ అది తిరిగి
వెళ్ళదు అని (యెషయా 55:11) మనము గుర్తుపెట్టకొందము. ఫలితము వెనువెంటనే
కనబడకపోయినను దేవుని వాక్యమును నమ్మకంగా ప్రకటించునప్పుడు సత్యవాక్యమైన సువార్త
ద్వారా దేవుడే మాట్లాడును. సువార్త అనేది మన వాక్సాతుర్యం మీదనో లేక ఒప్పించుటకు
మనము చేయు ప్రయత్నం మీదనో ఆధారపడి పనిచేయదు కానీ “సువార్త అనెది నమ్ము ప్రతివారికి
రక్షణ కొరకు దేవుని శక్తియైయున్నది” అని పౌలు వ్రాసినట్లుగా (రోమా 1:16) దేవుని మహాశక్తి మీదనే ఆధారపడి పనిచేయును. దేవుని వాక్యము సజీవమై, బలముగలదైయున్నది. అది రెండంచుల ఖద్దము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను, మూలుగును విభబించునంత మట్టుకు దూరుచు... (ైబ్రీ 4:12) శోధించును.
కావున ప్రియ మిత్రులారా, అపవాది అబద్దాల చేత మోసగింపబడినవారై ఆత్మీయ బంధకాలలో ఉన్నవారికి సత్యము, జీవమైయున్న దేవుని వాక్యమును మన బాధ్యతగాను ధన్యతగాను ప్రకటించి వారి హృదయాలను ఆ సత్యవాక్కు దేవుని శక్తి, మహాత్యము ద్వారా తెరచి విడుదల పొందునట్లు చేయుదము.ప్రార్ధన : ప్రియ ప్రభువా, నీ రాకడ సమీపమైయున్నది గనుక నశించిపోవుచున్న ఈ లోకమునకు నీ వాక్యముప్రకటించుట అవసరమైయున్నది. నేనంతగా మాట్లాడలేకపోయినను, సువార్తకు విరోధంగా మాట్లాడువారితో చర్చించు నేర్చు నాకు లేకున్నను నీ వాక్యమును వ్యాప్తిచేయు నమ్మకమైన శిష్యునిగా నేనుండవలెనని కోరుచున్నాను. గనుక నీ ఆత్మతో నన్ను బలపరచుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments