top of page

14, అక్టోబరు 2025 మంగళవారము || గొఱ్ఱెపిల్ల రక్తము పాపపు శక్తిని విరిచివేయును

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 14
  • 1 min read


తేనెధారలు చదువుము : నిర్గ.కౌం.12:21  24


‘‘మీరున్న యిండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటి పోయెదను  - నిర్గ. కాం.12:13


ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరి కుటుంబము కొరకు ఒక్కొక్క గొఱ్ఱెపిల్లని తీసికొని దానిని చంపి, దాని రక్తములో కొంత తీసికొని వారి ఇంటి ద్వార బందములకు పై కమ్మి, నిలువు కమ్ములకు పూయుమని దేవుడు వారికి ఆజ్ఞాపించెను. ఆ రక్తము చూచిన మరణదూత ఆ యింటిని దాటిపోవును. ఐగుప్తీయుల జ్యేష్ఠ కుమారులను ప్రభువు మొత్తునప్పుడు ఏ తెగులును ఇశ్రాయేలీయులను తాకదు. ఆ పస్కా గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టి ప్రభువు వారిని విడిపించెను. దేవుని మాట యందు విశ్వాసముంచుట ముఖ్యమని గమనించుడి. మన తెలివితో అంగీకరించుట చాలదు. మరణము నుండి తొలి సంతతి నుండి గొఱ్ఱెపిల్ల రక్తము కాపాడునను వాక్యము, మరియు ఆ రక్తమును ద్వారబంధాలకు పూయవలెనని చెప్పినప్పుడు నమ్మి అలా చేయుట ముఖ్యము. ‘‘ద్వారబంధాలకు రక్తము ప్రోక్షిస్తే మరణము తప్పించబడుననునది సరైనది కాదు’’ అనుచు ఎవరైన విభేదించినట్లైతే ‘‘వాని కుమారుడు చావవలసియుండును’’. ‘‘నేను నమ్ముచున్నాను’’ అని చెప్పి మరణ దూత నుండి కాపాడబడుటకు ఆ రక్తమును పూయకపోతే ప్రయోజనము లేదు. క్రీస్తు ప్రభుని రక్తము విషయము కూడా అంతే. 

ప్రియ మిత్రులారా, మీరు క్రైస్తవ కుటుంబంలో పెరిగి, పేరుకు యేసును విశ్వసించుచు, మీరు వ్యక్తిగతముగా సిలువ చెంతకు పరుగెత్తనట్లయితే ఉగ్రత మరియు తీర్పు, శిక్ష నుండి తప్పింపబడరు. ఈ దినమే నిశ్చయించుకొనుము ! నీవు పాపివని గుర్తించి, మీకు క్రీస్తుప్రభువు అవసరమని గ్రహించుము. రక్షణకు మీయందు కానీ, మీ సత్క్రియలు యందు కానీ నమ్మికయుంచుట మానివేయుము. మీ పాపముల కొరకు క్రీస్తు రక్తము దేవుడు చెల్లించిన వెలయని ఆ రక్తమునందే నమ్మిక యుంచుము. ఆ క్రీస్తు రక్తమును విశ్వాసముతో మీ హృదయమందు ప్రోక్షించుకొనినచో, దేవుని తీర్పు నుండి నీవు కాపాడబడుదువనుటలో ఏ సందేహము లేదు.

ప్రార్ధన :-  ప్రియప్రభువైన యేసూ, పస్కా అనేది ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విడుదలను గూర్చియే కాదు. కానీ అది నీ మహిమ, ఘనత నిమత్తమే. ‘‘నేను యేసునందు నమ్మిక యుంచుదును’’ అని చెప్పుటయే కాక విశ్వాసముతో నీ సిలువ చెంతకు ఇప్పుడే పరుగెత్తి నా హృదయములో నీ రక్తమును ప్రోక్షించుకొందును. నీవే నా ప్రభుడవు, రక్షకుడవని యేసునామములో ఒప్పుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page