15, అక్టోబరు 2025 బుధవారము || శ్రమలు వచినప్పుడు మనమెలా ప్రతిస్పందించుదుము?
- Honey Drops for Every Soul

- Oct 15
- 1 min read
తేనెధారలు చదువుము : నిర్గ.కాం 17:1-7
‘‘అప్పుడు మోషే, యెహోవాకు మొఱ్ఱ పెట్టుచు - ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురనెను.’’ - నిర్గ. కాం. 17:4
ఇశ్రాయేలీయులు రెఫీదీములో దిగినప్పుడు త్రాగుటకు వారికి నీరులేకపోయెను గనుక వారు మోషేకు విరోధముగా సణిగి, వాదించిరి. అప్పుడు మోషే ఎలా స్పందించెను? అతడు దేవునికి మొఱ్ఱపెట్టుటకే ఎంచుకొనెను కానీ, ఈ లోకస్తునికి శోధన వచ్చినప్పుడు ఇతరులతో వాదించినట్లు అతడు వారితో వాదించలేదు. లోకానుసారమైన మనిషి, ‘‘మీ నోర్లు మూయండి, కృతజ్ఞతలేనివారలారా!’’ అని కేకలు వేసి యుండువాడు. మోషే అయితే అలా చేయలేదు. మోషేకు కూడా కొందరు నమ్మకమైన ఇశ్రాయేలు పెద్దలు సలహాలు ఇచ్చుటకు ఉండిరి, కానీ అతడు మొదట దేవునినే ఆశ్రయించెను. కఠినమైన ఆటంకాలు, సవాళ్ళు ఎదురైనప్పుడెల్ల నడిపింపు కొరకు మోషే దేవునివైపే తిరిగెను. ఊహించని సమస్య వచ్చినప్పుడు అదే మాదిరిని మొదటగా దేవుని వద్దకు వెళ్ళుటయే మన పద్ధతిjైు యుండవలెను. భరించలేనంతగా దేవుడు మన జీవితంలో ఏదియు రానివ్వడు. ‘‘తన పిల్లలను దేవుడు అన్ని కొలిమి గుండా నడిపించునప్పుడు ఆయన ఒక ప్రక్క సమయమును, మరొక ప్రక్క కొలిమిని దృష్టించుచుండును’’ అని వారెన్ వియర్స్బి గారు వ్రాసిరి. కొన్నిసార్లు మనకు సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, కనబడనంత తుపాను తీవ్రముగా ఉండును. ఇతరుల ఆలోచన సరైనది కాకపోవచ్చు, మన గత అనుభవాలు మనకు వెలుగునిచ్చేవిగా ఉండకపోవచ్చు. ఒకే ఒక్క ఆలోచన మిగిలియున్నది. దేవుని మీదనే మనము వేచియుండవలెను. దేవుని నిత్యప్రేమ మరియు ఆయన విశ్వాస్యత యందే మనము స్థిరమైన నమ్మిక కలిగి యుండవలెను.
ప్రియ స్నేహితులారా, సమస్య మన తలుపు తట్టునప్పుడు మనము దేవుని వద్దకు వెళ్ళుచున్నామా ? ‘‘ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను’’ అను మన దేవుని వాగ్ధానము గుర్తుచేసికొనవలసి యున్నది. అరణ్యములో యాత్ర చేయుచు సంచరించుచుండిన సమయాన తిరుగుబాటు చేయు ఆ జనులను నడిపించుటకు మోషేకు ధైర్యము, శక్తి, నమ్మికనిచ్చినది ఇదే నిశ్చయత అనుటలో ఏ సందేహము లేదు. ప్రార్ధన :- ప్రియప్రభువా, కష్టము, సమస్య, ఆటంకము నాకెదురైనప్పుడు ‘‘మోషే పద్ధతి’ ని అనుసరించు కృపనిమ్ము.‘‘*ప్రార్థన*లో వాటిని దేవుని చెంతకు తీసికొని వెళ్ళుటయే నా స్పందనjైు యుండును గాక !’’ యేసు నామమున ఆమేన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments