top of page

13, అక్టోబరు 2025 సోమవారము || ఆత్మీయ పోరాటంలో జయమొందిన పిదప శత్రుదాడిని గూర్చి జాగ్రత్త !

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 13
  • 1 min read


తేనెధారలు చదువుము : ఆది కాం.14:17-24


ధనాపేక్షలేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి...’’ - హెబ్రీ 13:5


లోతు చెరపట్టబడెనని అబ్రహాము వినినప్పుడు అతడు 318 మంది తన పనివారిని తీసికొని ఆ ఐదుగురు రాజులును తరిమి, ఓడిరచి లోతును అతనికి కలిగిన సమస్తమును తిరిగి తెచ్చెను. శత్రువుల నోడిరచి అబ్రహాము తిరిగి వచ్చుచుండగా సోదొవ రాజు అతనిని కలిసికొని, ‘‘మనుష్యులను నాకిచ్చి, సొత్తు నీవే తీసికొనుము’’ అని చెప్పగా అబ్రహాము తన కొరకు కాక లోతు కొరకు సొదమ రాజు పక్షాన యుద్ధము చేసి ఆ ఐదుగురు రాజుల మీద జయమొందుట చేత సొదొమ రాజుకు గొప్ప సేవ చేసియుండెను. ఒక సాధారణమైన వ్యక్తికి తాను పట్టుకొని వచ్చిన ఈ లోకపరమైన సొత్తును రాజు నుండి తీసుకొనుట వలన ఏమి పరవాలేదు, అది మామూలే అనిపించును. కానీ విశ్వాసిjైున అబ్రహాము దానిని మించి కలుగు ఫలితమును చూచును. భవిష్యత్తులో ఏమి సంభవించునో అతడు చూచి, ఆ అన్యరాజుతో ఎట్టి అనుబంధము పెట్టుకొనకయు, లోబడకయు ఉండి సర్వోన్నతుడైన దేవునికి చెప్పించవలసిన మహిమను ఆ రాజుకు చెల్లించకయుండెను. (ఆది కాం.14:22) అంతకంటే ముఖ్యముగా అట్టి బహుమతులు అబ్రహాముకు అవసరము లేకుండెను, అది వద్దు అనుకొనుట చేత అతడేమియు పేదవాడు కాడు. దేవునినే అతని కేడెముగాను, గొప్ప బహుమానముగాను ఉండువానికి ఆ సొదొమ రాజు ఇవ్వ చూపు బహుమానాలు అవసరము లేకుండెను. ఒకవేళ ఆ సొదొమ రాజు చెప్పిన దానికి లోబడి తీసికొనియుండి ఉంటే అబ్రహాము తన సాక్ష్యము కోల్పోయి ఉండేవాడు. అప్పుడు జనులు కూడా ‘‘అబ్రహాము విశ్వాసము, ప్రేమను బట్టి కాక అతనికి కలిగిన లాభము కొరకే లోతును కాపాడెనని చెప్పుకొనియుండేవారు’’.


ప్రియ స్నేహితులారా, మనము ఖచ్చితముగా అబ్రహాము మాదిరి ననుసరించి, ఆత్మీయ విజయము పొందిన పిదప ఎంతో జాగ్రత్త కలిగియుండవలసియున్నది. మరి ముఖ్యముగా మనలను ప్రలోభపెట్టుటకు మెల్లగా అపవాది వచ్చు సమయాలలో పోరాటమునకు ముందు ఎలాగో, జయమొందిన తరువాత కూడా జాగ్రత్త కలిగి యుందము. 

ప్రార్ధన: ప్రియప్రభువా, సొదొమ రాజు నుండి అబ్రహాము ఒక్క నూలుపోగైనను, ఒక చెప్పుల వారైనను బహుమానాలుగా తీసికొనలేదు. ఎందుకంటే అలా చేస్తే దేవునితో అతని నడకను అది అపవిత్ర పరచియుండును. అపవాది దాడులను గూర్చి మెళకువ కలిగి, జయమొందిన పిదప నీకు మాత్రమే మహిమ చెల్గించు కృపనిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page