top of page

12, అక్టోబరు 2025 ఆదివారము || పాపపు తీవ్రత దానినుండి కలుగు ఖచ్చితమైన తీర్పు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 12
  • 2 min read


తేనెధారలు చదువుము : ఆది కాం. 19:15-22


‘‘లోతు ప్రభువా, ఆలాగు కాదు ! ... నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ...నేను చచ్చిపోవుదునేమో’’ అని వారితో చెప్పెను’’. - అది కాం. 19 : 18,19


దేవుడు సొదొమను నాశానము చేయక మునుపు అక్కడి నుండి లోతును, అతని కుటుంబమును కాపాడుటకు ఆయన తన దూతలనంపెను. లోతు నీతిమంతుడైనందున దేవుడు అలా చేయలేదు కానీ అబ్రహాము పట్ల ఆయనకున్న కనికరమును బట్టియే. ఆది కాం.18లో అబ్రహాము సొదొమ కొరకు విజ్ఞాపన చేయుచుండెను. మరియు ఆది కాం.19:29లో దేవుడు ఆబ్రహామును జ్ఞాపకము చేసికొని గొప్ప విపత్తుకు గురి కాబోవుచున్న ఆ సొదొమ, గొమొఱ్ఱా పట్టణముల నుండి లోతును బయటకు తెచ్చెను’’ అని చెప్పబడినది. ఆ దూతలు లోతు కుటుంబమును సొదొమ నుండి బయటకు తెచ్చినప్పుడు ఆ కొండకు పారిపొమ్మని ఆ దూతలు వారితో చెప్పిరి. కానీ లోతు జవాబును గమనించుడి. అతడు ‘‘లేదు నా ప్రభువులారా !  నీ దృష్టిలో నేను దయపొందినవాడనైతే నీవు నా ప్రాణము రక్షించుకొనుటకు నేను ఆ కొండకు పారిపోలేను, గనుక ఈ దగ్గరలో ఉన్న ఈ చిన్న ఊరికి తప్పించుకొని పోవుటకు సెలవిమ్ము’’ అని చెప్పెను. లోతు నిర్భయంగా దేవునికిచ్చిన జవాబు మనలను నిర్ఘాంతపరచును. అతడు తన జీవితము పట్ల దేవుని చిత్తమును అంగీకరించుటకు ఇష్టపడలేదు, కానీ అతడు పట్టణ జీవితమును జీవించుటకిష్టపడెను ! కొండకు పారిపోతే దేవుడతనిని కాపాడునో లేదోయని సందేహ పడెను ! సొదొమ పట్టణము వలెనే పాపముతో నిండిన సోయరు అను ఊరుకు పంపుమని దేవుని నడుగుటకు ఇష్టపడుట నమ్మశక్యముగా లేదు.

 

ప్రియ మిత్రులారా, లోతు జీవితంలో అధోగతిని మనము చూచుదుము. మొదట, లోతు సొదొమను విడుచుటకు ఒప్పుకొనలేదు, తరువాత అతడు దేవదూతలతో వాదించెను, ఆ తరువాత తన యిష్టమైన చోటికి వెళ్ళుటకు అనుమతించుమని అతడు వారిని ప్రాధేయపడెను. అతడు దేవుని కనికరమును బట్టి కృతజ్ఞత కలిగియుండి, ఆయన ఆజ్ఞలకు లోబడి యుండుటకు బదులుగా లోతు దేవుని చిత్తమును, ఆయన మార్గాలను అడ్డుకొనెను, కానీ లోతు యొక్క విన్నపమును దేవుడు కృపతో అంగీకరించుట ఎంత ఆశ్చర్యము ! లోతు భౌతిక మరణము నుండి తప్పించబడినది నిజమే కానీ లోతు కుమార్తెల అపవిత్రమై కార్యము వలన వారు అమ్మోనీయులు, మోయాబీయులకు తల్లులగుటను బట్టి అతని ప్రాణము, అతని కుటుంబీకుల ప్రాణములను నిత్యత్వమునకు చేరక వ్యర్ధమాయెను. ఆ రెండు జాతులవారు దేవునికి హేయులు. విశ్వాసులందరి, సందేహపడరాదని, అవిధేయత లేక దేవునిపై అపనమ్మిక కలిగియుండరాదని లోతు ఒక హెచ్చరికగా ఉన్నాడు. 

ప్రార్ధన:  ప్రియప్రభువా, ఈ లోకముతో చిన్న చిన్న విషయాలలో రాజీపడినందున అవి చివరకు అతని పతనానికి దారితీసినవి. అతడు విశ్వాసిjైుయుండినను, నీ ఆశీర్వాదాలన్నింటినీ పొంద నవకాశముండియు అతని పాపపు తీర్మానముల ద్వారా ఎంతో విచారకరమైన అంతము కలిగి యుండెను. ఈలోక శోధన ద్వారా పరలోక దర్మనము నుండి తొలగిపోకుండా జాగ్రత్తపడు కృపనిమ్మని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page