౮9, ఆగష్క్పు 2025 శనివారము || నా జీవితమును నీకారకు ప్రతిష్టింపబడనిమ్ము
- Honey Drops for Every Soul

- Aug 10
- 2 min read
తేనెధారలు చదువుము : యాకోబు 4:7-10
“దేవునికి లోబడియుండుడి... దేవుని యొద్దకురండి...” యాకోబు 4:7
లోబడియుండుట లేక అప్పగించుకొనుట అనగా మనలను మనము దేవుని అధికారమునకు, ఆయన చితానికి, ఇవ్వానికి అప్పుగించుకొనుట. మన తలంపులు, ఆలోచనలు, మన క్రియలు, మన అపేక్షలు అన్నియు దేవుని వాక్యానుసారంగా నడిపించబడుట. మన కైస్తవ జీవితాలను యదార్ధంగా పరిశీలించుకొంటే ప్రతి ఒక్కరిలో ఎంత స్వార్ధము లేక అహము ఉన్నదో చూడగలము! ఇది విసుగుదల, అసూయ, పగ, కిష్టమైన చింతలకు దారితీయును. ఇతరుల పట్ల మొండిగాను, ఏ మాత్రము తగ్గించుకోని స్వభావముగాను ఉందును.
ప్రియ స్నేహితులారా, ఈ అహము పూర్తిగా బ్రద్దలుకొట్టబడవలసి యున్నది, అది దైవ స్వరూపమందున్న క్రీస్తును చూచు ప్రదేశమైన సిలువ చెంత తప్ప మరెక్కడను విరుగగొట్టబడదు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనకొరకు దాసుని రూపము ధరించెను (ఫిలిప్పీ 2:5-8) మనిషి పాపమును మోసికొనిపోవు బలిపశు వుగా తన శరీరమందు వాటిని వేసికొని మాను మీద (వ్రేలాడదీయ బడుటకు తనను తాను తగ్గించుకొని విరిగిన స్థితిలో వెళ్ళుటకు మనమాయనను చూచుదుము. ప్రవచనాత్మక కీర్తనయెన కీర్తన 22:6లో 'నేను నరుడను కాను పురుగును” అని ఆయన చెప్పుచున్నాడు. వాముకు, పురుగునకు మనము తేడా చూడవచ్చు. వాటిని కొట్టునప్పుడు తిరిగి దాడిచేయునట్లు సర్పము బుస కొట్టును. అది అహమునకు నిజ చిత్రము ! కానీ పురుగు ఎదురు తిరగదు. దానిని మనమేమి చేసినను ఊరకుండును. దానిని తన్నినను, పాదముల క్రింద నలిపివేసినను
ఎదిరించదు. మనకొరకే యేసు ఆ పురుగువలె అగుటకు ఇష్టపదెను. గనుక ఇప్పుడాయన మనమును ఆయనవలె ఉండవలెనని చెప్పుచున్నాడు. - పగతీర్చుకొనుటకు కాక మన శత్రువులను యేమించుటకును, అదియు నిస్వార్ధంగా (శేమించుటకును మనకు పిలుపు నిచ్చుచున్నాడు. కానీ మనలను మనము ఉపేక్షించుకొనుట లేక పాపమునకు చనిపోవుట ఒకేసారి జరగదు. అది కొనసాగు ప్రక్రియ. దినమంతయు మనకు వేలవేల అవకాశాలు మన౩దురుపడును. అనగా మన ఉద్దేశాలకు, సుఖభోగాలకు, ధనము, సమయము వ్యర్ధము చేయుటకు కాదు అని చెప్పుటకు. దేవుని నడిపింపుకు మనము అప్పగించుకొనినప్పుడు ఆయన మనలను కృపలో ఉన్నత స్థానాలకు నడిపించి మరింతగా క్రీస్తువలె మార్చును.
ప్రార్దన:- ప్రియ ప్రభువా, గర్వ హృదయమును నీ దయకు, ఈ లోక మనసును నీ పరిశుద్దతకు, నా చంచలమైన మనస్సును నీ సర్వాధికారమునకు లోబరచుటకు నాకు సహాయము చేయుము. పషరతులు లేకుండా నన్నునేను నీ చిత్తానికి అప్పగించుకొనుటకు యిష్టపడి, ఏ మాత్రము వెనుకాడక, ఎదురు తిరగక నీ అధికారమునకు నా సమస్తమును సమర్వించుకొను కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments