top of page

౦౮8౬, ఆగష్టు 2025 శుక్రవారము || ఆత్మీయ అంభులను యేసు మాత్రమే స్వస్థపరచగలడు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 9
  • 2 min read

తేనెధారలు చదువుము : యాహాను 9:1-12



“అప్పుడు యేసు - చూడనివారు చూడవలెను... అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను” - యోహాను 9:39


పూర్వకాలము (గ్రుడ్డితనము సర్వసాధారణమే గనుక అట్టి గ్రుడ్డివారిని అంతగా లక్ష్యముంచక పోవుటచే వారు భిక్షాటన చేసేవారిగా మారి చిన్నచూపు చూడబదేవారు. ప్రభుయేసు ఈ భూమిపై ఉన్న కాలంలో వారు గ్రుడ్దివారని గుర్తించుటకు ప్రత్యేకమైన దుస్తులు ధరించేవారు. [గ్రుడ్డి బర్తిమయి తాను చూపు పొందినప్పుడు అతడు తన బట్టను పారవేసినట్లు మనము జ్ఞాపకము చేసికొనవచ్చు. ఆ బట్టయే అతనిని ([గ్రుడ్డివాదని గుర్తించునదై యుండవచ్చు. ఈ రోజుల్లో ప్రత్యేకమైన నల్ల అద్దాలు లేక వారు పట్టుకొని నడుచు చేతికర్రలు చూచి, ఒకడు గ్రుడ్డవాడని గుర్తువట్టవచ్చు. ఇది భౌతికస్థితి అయితే ఆత్మీయంగా (గ్రుడ్డవారిని కూడా కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. వారు యేసుప్రభువు పట్ల మరియు లేఖనాలు లేక వాక్యము పట్ల ఆసక్తి చూపరు. నరకము, పరలోకమును గూర్చి కూడా లెక్కచెయరు. వారీ లోకము, ఈ లోక దేవతల కొరకే బ్రదుకుదురు. ప్రార్ధించుటకే యిష్టపడరు. పుట్టుగ్రుడ్డివానిని యేసు స్వస్టపరచుటను గూర్చి ఈ దిన వాక్యభాగంలో మనము చదువుదుము. ఆ గ్రుడ్డివాడు తనను స్వస్థపరచుమని కేకలు వేయకపోతే ప్రభువు అతనిని దాటి వెళ్ళ ఉండవచ్చు. ఆయన (పేమ, కనికరము గలవాడు గనుకనే ఆగి, అతని అక్కర తీర్చెను. ఆయన అతనిని స్వస్థపరచి దృష్టినిచ్చెను. ఈ దినము కూడా ఆయన ఆలాగున చేయును ! ప్రభువైన యేసుక్రీస్తును కలిగియుండనివారు ఆత్మీయంగా గ్రుడ్డివారు. పౌలు చెప్పుచున్నట్లు “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమై దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను” (2 కొరింధీ 4:4). వారు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని జీవము నుండి వేరుపరచబడి చచ్చినవారుగా ఉ న్నారు (ఎఫెసి 4:18) వారొకవేళ సత్యమును గూర్చి అవగాహన లేక భౌతికమైన వాటినే చూచు, ఆత్మ విషయమైన సంగతులను దృష్టించుట లేదేమో.


స్నేహితులారా, నశించుచున్న వారి ఆత్మీయ నేత్రాలు తెరువబడి ఈ లోకానికి వెలుగైయున్న యేసును చూచుటకును, ఆయనను వారి ప్రభువుగాను, రక్షకునిగాను స్వీకరించునట్టు, దేవుడు రక్షణ అను అద్భుతము జరిగించునట్లు ప్రార్ధించుట మనకు దేవుడనుగ్రహించిన ఒక బాధ్యతయైయున్నది.

ప్రార్దన:- ప్రియ ప్రభువా, ఆత్మలో గ్రుడ్డితనము కలిగియున్న వారిని నేను చూచినప్పుడు శిష్యులు చేసినట్లుగా వారిని విమర్శించక, నీవలె వారి పట్ల కనికరము కలిగి వారిని నీవద్దకు నడిపించు కృపనిమ్ము. వారి ఆత్మ నేత్రాలు తెరవబడి నిన్ను వారి ఆత్మకు రక్షకునిగాను, ఈ లోకానికి వెలుగుగాను ఎరుగునట్లు కృపచూపుమని యేసు నామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page