31, ఆగప్పు20225 ఆదివారము || చేవుని హృదయానికి దళ్ళ్గరగా ఉండుము
- Honey Drops for Every Soul
- Aug 31
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 27:1-5
“నా మరుగుచోటు... నీవే...” - కీర్తన 119:114
“పరిపూర్ణమైన విశ్రాంతి, దేవుని హృదయానికి దగ్గరగా ఉండు పాపమిక వెధించలెని స్థలమొకటి
ఉన్నది” అను కీర్తన క్లెలాండ్ బి. మెక్ అఫీ అను రచయిత 1901 సం॥లో వ్రాసి కూర్చాను. అప్పుడతడు ఇల్లినాయిస్‌లోని చికాగోలో ఉన్న ఫస్ట్ పెస్పిటేరియన్ అనే ఒక పెద్ద చర్చికి పాస్టరుగా ఉండెను. తన ప్రియమైన సహోదరుని కుమార్తెలు డిఫ్తీరియా వ్యాధి వలన ప్రాణము కోల్పోయిరను
విచారకరమైన వార్త ఒక దినాన అతనికి రాగా, అతడింకను బాధతోను, దిగ్భాంతితోను ఉ ౦డగానే తన ఆత్మకు, అలాగా తన కుటుంబ సభ్యుల ఆదరణ కొరకును అతడా కీర్తన వ్రాసెను. అతడా పాటను వారి అంత్యక్రియలు జరిగిన మరునాడు అంధకారములో మునిగియున్న తన సోదరుని గృహము వెలుపల వారి కుటుంబమునెంతో ఆదరించునట్లు గద్దద స్వరముతో పాడెను. అప్పటి నుండి ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరికి గొప్ప ధైెర్యమునిచ్చు కీర్తనగా ఈనాటి వరకు అది ఉన్నది.
ప్రియ స్నేహితులారా, ఈ పాట చెప్పుచున్నట్లుగా కలవరముతో ఉన్న ఆత్మకు ఆదరణనిచ్చు దేవుని హృదయమునకు దగ్గరగా ఉన్న స్థలము వంటి ప్రదేశము ఈ లోకంలో మంక్కడను లేదు. కృంగిన స్థితిలో ఉన్నవారు తమ రక్షకుని కలిసికొని సాటిలేని సమాధానము, ఆనందమును పొందు స్టలము అదియే. “నేను దేవునితో ఉన్నప్పుడు నా భయము పోయెను, దేవుని గొప్ప నెమ్మదిలో నా కష్టాలు రోడ్డు మీది గులకరాళ్ళ వలె దొర్లిపోయి నా ఆనందాలు నిత్యము నిలుచు కొండలవలె ఉ ౦డును” అని ఒక గొప్ప దైవజనుడు వ్రాసెను. ఇదెంత నిజమో కదా ! ఈ లోకంలో హఠాత్తుగా అనుకోని రీతిలో నష్టాలు, నిరాశలు మనకు కలిగి, మన మనశ్శాంతిని దోచుకొనుచుండవచ్చు. మనం నమ్మినవారే మనలను మోసము చేయవచ్చు. కానీ, వీటన్నిటి మన కలవరాలను నిమ్మళింపచేసి, ప్రశాంతతనిచ్చు ఒక స్థలమున్నది అదియే పూర్ణశాంతినిచ్చు దెవుని హృదయానికి దగ్గరగా ఉన్న ఆయన ఎద. కావున మనము మన రక్షకుని చెంతకు పరుగిడిపోయి, ఆదరించు ఆయన బాహువులపై ఆనుకొని సమస్త జ్ఞానమునకు మించిన నెమ్మది, సమాధానమును పొందుదము.
ప్రార్ధన :- ప్రేమగల పరలోక తండ్రీ సమస్యలు నన్ను చుట్టుముట్టుచున్నవి, నాకు విరోధంగా చెడే ఎదురగుచున్నది. నీకు నేనెంతో దగ్గరగా ఉన్నందున నేను భయపడను. పరలోక శాంతి, కాపుదలనిచ్చు సురక్షితమైన స్థలము మరేదియు లేదని నమ్ముచు, యేసునామమున ప్రార్థించు చున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments