30, సెప్టెంబర్ 2025 మంగళవారము || మీరు సంతోషంగా ఉండవలెననుకొనుచున్నారా ? ఇతరులకు సాయం చేయుము
- Honey Drops for Every Soul

- Sep 30
- 1 min read
తేనెధారలు చదువుము : తీతు 3:1-8
‘‘దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనిjైుయున్నాము’’
- ఎఫెసీ 2:10
ఒక రైతు ప్రతి సం॥ తన ధాన్యమును వ్యవసాయ ప్రదర్శనకు తెచ్చి అక్కడ ఉత్తమ ధాన్క బహుమతిని పొందుచుండెను. ఒక సం॥ ఒక వార్తాపత్రిక విలేఖరి ఆ రైతు తన ధాన్యపు విత్తనాలను తన పొరుగువారికి కూడా ఇచ్చేవాడని తెలిసికొని ‘‘నీవు విత్తుటకు దాచుకొనిన నీ శ్రేష్ఠమైన ధాన్యమును ప్రతి సం॥ నీతో పోటిపడు నీ పొరుగువారికి ఎలా ఇస్తున్నావు ? ఎందుకు ? అని అడిగెను. అప్పుడా రైతు ‘‘పంట పండునప్పుడు దాని పుప్పొడి రేణువులు గాలికి ఒక పొలమునుండి మరొక పొలమునకు వ్యాపించును. ఒకవేళ నా పొరుగువారు నాసిరకపు ధాన్యము పండిస్తే ఆ పుప్పొడి సంపర్కముతో నా ధాన్యపు నాణ్యత కూడా తగ్గిపోవును. నేను మంచి ధాన్యము పండిరచవలెనంటే నా పొరుగువారు మంచి ధాన్యము పండిరచుటకు నేను సహాయము చేయవలసినదే’’ అని చెప్పెను.
ప్రియ మిత్రులారా, తన పొరుగువాని పంట బాగా పండితేనే తన పంట బాగుండునను వాస్తవము ఆ వ్యవసాయదారునికి బాగా తెలుసు, గనుకనే పంట నాణ్యత బాగుండవలెనని అతడు వారికి సాయం చేయుచుండెను. ఈ రైతు యొక్క వైఖరి నుండి మనమొక జీవిత పాఠాన్ని నేర్చుకొందము. మన పొరుగువారితో సమాధానముగా జీవించవలెనంటే వారు నెమ్మదిగా ఉండుటకు మనము వారికి సాయము చేయవలసియున్నది. సత్క్రియలు చేయుటకు మనమాసక్తి కలిగియుండవలెను. ఇతరులకు మనమే విధంగాను అడ్డు బండలుగా ఉండరాదు. పౌలు తీతుకు వ్రాసిన పత్రికలో ‘‘అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము’’ అని సూచించుచున్నాడు. (తీతు 2:7). అంతేకాదు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు వారికి జ్ఞాపకము చేయుమని తీతుకు పౌలు ఉపదేశించెను (తీతు 3:1). మనుష్యులకు ప్రయోజనకర మైనవి చేయుటకే శ్రద్ధగా సత్క్రియలను చేయుటయందు మనస్సు ఉంచమని చెప్పవలెనని పౌలు ముగింపు తీతుకు వ్రాసెను. గనుక మనకు అవకాశము దొరికినప్పుడెల్ల అందరికి మేలు చేయుదము. ఇతరులు బాగా బ్రదుకునట్లు వారికి సాయపడి సంతోషించుదము.ప్రార్థన :` ప్రియ ప్రభువా, స్వార్థంగా ఉండక నీ చేతినుండి నేను పొందిన దీవెనలన్నిటిని ఇతరులతో పంచుకొను కృపనిమ్ము. మేలైనది చేయుచు మాదిరిగా నుండి సాధ్యమైనంతగా ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండునట్లు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments