30 ఆగప్పు 2025 శనివారము || పొంగిపొర్లు ప్రేమ
- Honey Drops for Every Soul
- Aug 30
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 133:1-3
“అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును” - కీర్తన 133:2
సహోదరుల ఐక్యతను గూర్చి ఈ కీర్తనలో దావీదు చెప్పుచున్నాడు. ప్రధాన యాజకుడైన అహరోనును అభిషెకించిన అమూల్యమైన పరిమళ తైలముతో ఈ సహోదరుల ఐక్యతను ఆయన పోల్చుచున్నాడు. ఆ ప్రశస్తమైన తైలమునుండి పరిమళ తైలము వచ్చినట్లే సహోదరుల ఐక్యత కూడా ఉండవలెను. రెండవదిగా, ఆ ప్రశస్తమైన తైలము కారి, అలముకొనునది. అది అహరోను తలమీద పోయబడి, అతని అంగీల అంచువరకు దిగజారెను. సహోదర (ప్రేమ కూడా అలాగే ఉ ౦దును. ఆ గ్రేమలో ఉన్న శక్తి దాని ప్రభావములో ఉన్నవారందరికి వ్యాపించును. ఆ నూనె పోయబడిన చోటే నిలిచియుండలేదు కానీ ఆ ప్రధాన యాజకుని తలమీద నుండి దిగజారి అతని గడ్డమును తడిపి, అతని ప్రతిష్టిత వస్తాలను కూడా తడుపును. అలాగే సహోదర ప్రేమ కూడా ఉ దును. ఎవరి హృదయాలలో ఆ (డ్రేమ కుమ్మరింపబడెనో అక్కడే ఉందక వారికి సంబంధించి నావారందరికి అది వ్యాపించును. శాఖలు, జాతులు, తెగలు లేక వయసును బట్టీ కైస్తవ (శేమకు పరిమితి ఉండదు.
ప్రియ మిత్రులారా, క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తిని మనము కలిసికొంటిమా? అయితే క్రీస్తు శరీరమందు ఒక అవయవముగా మనమతనిని గుర్తించి అతనికి స్థిరమైన ప్రేమ అందించవలెను. అతనెంతో పేదవాడు. ఆత్మీయుడే కాదేమో, (పప్రమకు అర్హుడే కాదా? అయితే అతడు అహరోను యొక్క అంగీల అంచువలె ఉండి మన హృదయంలో నుండి మేమ అతనిని కూడా తాకవలెను. ఎందుకనగా సహోదర ప్రేమ క్రింది వరకు ప్రవహించును. ప్రేమ గర్వించదు; కఠినమైనది కాదు. అది ఉప్పాంగదు కానీ, అది తగ్గింపు, సాత్వికము గలది. క్రిస్తుప్రభుని శరీరమునకు చెందినవారందరికి మననుండి పరిశుద్ధమై పరిమళ వాసనయైన (ప్రమ వ్యాపించును గాక.
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, సహోదర, సహోదరీల మధ్య ఐక్యత కలిగించు ప్రేమ తైలము నాపై పోయుము. నా శాఖ, నా తెగ, నా స్థితిని బట్టి గర్వింపక అల్పులు, క్రింది స్థాయిలోను, నశించిపోవు చున్న వారి మీద నా ప్రేమ పొంగి ప్రవహించి, దీవించుటకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments