top of page

29, సెప్టెంబర్ 2025 సోమవారము || కేవలం విశ్వసించుటయే కాదు, నమ్ముము !

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 29
  • 2 min read

తేనెధారలు చదువుము : అపో.కార్య 16:25-34


‘‘కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము’’ - కీర్తన 20:7


‘‘రక్షింపబడుటకు మేమేమి చేయవలెను ?’’ అని ఫిలిప్పీలోని చెరసాల అధికారి పౌలు, సీలను ప్రశ్నించినప్పుడు వారు, ‘‘ప్రభువైన యేసునందు విశ్వాసముంచుడి, అప్పుడు మీరు రక్షింపబడుదురు’’ అని జవాబిచ్చిరి. నూతన ఆంగ్ల బైబిలు ఏమని చెప్పుచున్నదనగా, ‘‘మీ నమ్మిక ప్రభువైన యేసునందు ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు’’ అని. ‘‘విశ్వాసము’’ అను మాట వాస్తవానికి ‘‘తలకు’’ అనగా ‘‘తెలివి’’కి సంబంధించినది. అది ఒక మానసిక ప్రక్రియ. కానీ ‘‘నమ్మిక’’ అనునది ‘‘హృదయానికి’’ చెందినది. అది మన ప్రయత్నముతో కాక, క్రియను కోరును. ఓస్వాల్డ్ జె స్మిత్ దీనిని ఎంతో చక్కగా ఈ ఉదాహరణతో వివరించెనుÑ ఎంతో పెద్దదైన నయాగరా జలపాతమును త్రాడు మీద దాటునట్లు 11 వందల అడుగుల పొడవైన త్రాడును ఏర్పాటుచేయగా చార్లెస్ బ్లాండిన్ అను ఈ లోకంలోనే గొప్ప సాహసవీరుడు తన  40 పౌండ్ల బరువైన కర్రను రెండు చేతులతో పట్టుకొని ఆ త్రాడుపై నడిచి విజయవంతంగా ఆవలి తీరాన అడుగిడెను. అక్కడ చూచుచున్న వారిని చూచి అతడు తిరిగి అవతలి ఒడ్డుకు తన వీపుమీద ఎక్కి దాటుటకు అడిగెను. ‘‘నేను నిన్ను దాటించగలనని నమ్ముచున్నావా ?’’ అని ఒక వ్యక్తిని అడుగగా అతడు, ‘‘లేదు నా ప్రాణాన్ని పణముగా పెట్టలేను’’ అని చెప్పగా అతడు హెన్రీ కోల్కార్డ్ అనే తన మేనేజరును ‘‘నువ్వేమంటావు ?’’ అని అడుగగా ‘‘నేను నమ్ముచున్నాను, నిజముగానే నాకే సందేహము లేదు’’ అని చెప్పెను. అప్పుడు 38 అడుగుల పొడవైన కర్రను పట్టుకొని వారు కలిసి నడుచుటకారంభించిరి. దాదాపుగా ఆవలి తీరమును సమీపించుచుండగా ఒక జూదగాడు ఆ తాడును కొద్దిగా కోయగా ఆ త్రాడు ఎంతో భయభ్రాంతులు కలిగించునట్లు ఊగిసలాడినది. అప్పుడు బ్లాండిన్, కోల్కొర్డ్తో ‘‘నీవిక కోల్కోర్డ్వా కాదు, నీవిప్పుడు బ్లాండిన్వి. నీవు నాలో భాగమైయుండుము. నేను ఊగితే నీవు కూడా నాతో కూడా ఊగుము. నీవు చక్కగా ఉండుటకు ప్రయత్నించకుము, లేకపోతే మనిద్దరము చనిపోవుదుము’’ అని చెప్పెను. ఆ కాంకర్డ్, బ్లాండిన్ మాటలకు లోబడి, చివరకు వారు ఆ నయగారా జలపాతపు ఆవలి వైపుకు చేరిరి. దీనితో చూచుచున్నవారు ఎంతో ఆశ్చర్యానికి గురిjైురి. అదే నమ్మిక !

 ప్రియ మిత్రులారా, యేసు మిమ్ము పరలోకానికి తీసికొని వెళ్ళునని మీరు నమ్మవచ్చు కానీ, మొదట నీవే ఒక అడుగువేసి ఆయనకు కట్టుబడియుంటేనే ఆవలి ఒడ్డుకు చేరరు. కేవలము విశ్వసించవలదు, నమ్ముడి.
ప్రార్ధన :` పరమ తండ్రీ, నీ ప్రియ కుమారుడైన యేసు నన్ను రక్షించుటకు వచ్చెనని కేవలము నా మనసుతో నమ్మక, నా పూర్ణ హృదయముతో ఆయనయందు నమ్మికయుంచు కృపనిమ్ము. నా భారమంతయు ఆయన మీదనే మోపి, ఆయనను హత్తుకొని సురక్షితముగా అద్దరికి చేరుటకు సహాయము చేయుమని యేసునామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page