29, ఆగపు 20225 శుక్రవారము || దేవుని నిల్‌క్షజా గదిలో
- Honey Drops for Every Soul
- Aug 29
- 2 min read
తేనెధారలు చదువుము : రోమా 4:18-22
“నా కాలగతులు నీ వశములో నున్నవి...” - కీర్తన 31:15
మన ప్రతి ఒక్కరి జీవితాలలో దేవునికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక మరియు దానిని ఆయన
తగిన సమయమందు నెరవెర్చును. ఆయన సమయము మనమెరుగము గనుక పూర్ణ హృదయముతో ఆయనయందు నమ్మికయుంచుటయే మనము చేయవలసినది. అప్పటికింకను అబ్రాహాముకు పిల్లలు లేనప్పుడాయనకు (ప్రభువు ప్రత్యక్షమై దర్శనములో ఆయనకు ఆకాశమును చూపించి “నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము” అని చెప్పెను (ఆది.కాం. 15:5). కుమారుని ఎప్పుడిస్తాడో దేవుడు అబ్రహాముకు చెప్పలేదు. అబ్రాహాము ఎదురుచూస్తునే యుండెను. అతనినాశీర్వదించి ఒక గొప్పు జనముగా చేసెదనని దేవుడతనికి మొదట కనబదినప్పుడు చెప్పి అప్పటికి పది సుదీర్చ సం॥లాయెను. ఆ సమయంలో శారా సహనము కోల్పోయెను. ఆమె తానే దేవునికి సాయం చేయుదననుకొనెను ! హాగరును అబ్రాహమునకు భార్యగా చేసి ఆమె ఘోర తప్పిదము చేసెను (ఆది.కాం. 16:2). కానీ, అబద్దమాడుటకును, తన మనస్సు మార్చుకొనుటకును దేవుడు నరుడు కాడు కదా. దేవుడు తన ప్రియ దాసుడైన అటబ్రహామునకిచ్చిన వాగ్భానమును నెరవేర్చుటకు నమ్మకముగా ఉందెను. 15 సం॥ల పిదప అబ్రహాము 99 సం॥ల వయసు గలవాదైనప్పుడు దేవుడతనికి ప్రత్యక్షమై తన వాగ్గానాన్ని స్టిరపరచెను. శారా అపనమ్మికతో ప్రవర్తించినను దేవుడు శారా ద్వారానే అబ్రహామునకు ఇస్సాకు ననుగ్రహించెను. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు ! 25 సం॥ల సుదీర్హ కాలము అబ్రహాము దేవుని విశ్రాంతి గదిలో వేచియుండెను ! అయినప్పటికి అతడు నిరాశపరచబడలేదు. దేవుడు తన వాక్యములోని (ప్రతి మాటను నెరవేర్చెను. ప్రియ మిత్రులారా, దేవుని యొక్క విశ్రాంతి గదిలో వేచియున్నారా ? ఎంతోకాలం నుండి అలా ఉన్నారని అనుకొనుచున్నారా ? దేవునికొక ప్రణాళిక, సమయము ఉన్నది. నీవక్కడ ఉ ౦డగానే దేవుడు తాను నీకిచ్చిన వాగ్ధానము నెరవేర్చుటకు సిద్దపడుచున్నాడు. మీరు కేవలము ఆయనను నమ్మవలసియున్నది. సమయం కొంత ఆలస్యమైనను నిరీక్షించి యుండు ఆ సమయంలో మీ విశ్వాసము అధికమై పరిపూర్ణతలో నూతన న్ధాయికి చేరుకొందురు. దేవుని ప్రణాళికలోను, సమయములోను జోక్యం చేసికొనుటకు ధైర్యం చేయవద్దు. దేవునికంటె అతి తెలివిగా (ప్రవర్తించవద్దు. ఆయనయందు నమ్మికయుంచి ఆయన ఇచ్చు సమృద్ధి దీవెనలను పొందుకొందము.
ప్రార్దన :- సర్వశక్తిగల దేవా, నీవు నమ్మకమైన దేవుడవు, నీవెన్నడు నీ మనస్సు మార్చుకొనవు. నీవు నాకే వాగ్జానమిచ్చితివో అది ఆయన ఖచ్చితంగా నెరవేర్పును. నిరీక్షించుచు నీ సన్నిధిలో కూర్చొని అసహనముతో విసిగిపోక తప్పక నీ ఆశీర్వాదాలను పొందుదునను నమ్మికను పెంపొందించు కొను కృపనిమ్మని యేసునామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments