top of page

28, సెప్టెంబర్ 2025 ఆదివారము || మనము దేవుని ఆలయమైయున్నాము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 28
  • 1 min read

తేనెధారలు చదువుము : 1 కొరిథీ 6:12-20


"అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండెను’’ - యోహాను 10:23


రోగగ్రస్తుడైన ఒక వృద్ధుడు క్రిస్మస్ ఆరాధనకు హాజరు కావలెననుకొని చర్చికి వెళ్ళగా అక్కడ స్త్రీ పురుషులు అనేకులతో కిక్కిరిసి ఉండుట చూచి ఎంతో నిరుత్సాహపడెను. అప్పుడాయన తనను తాను కోటుతో కప్పుకొని, ఒక చెట్టుక్రింద నిలుచుండి కన్నీరు కార్చుచు ‘‘నేను మరొక క్రిస్మస్ను చూడకపోవచ్చు. వృద్ధుడను, బలహీనుడను, ఇలా ఎందుకు జరిగింది దేవా ? అని అనుకొనెను. ఆ క్షణమే ఆయన ఒక స్పర్శ ననుభవించి, యేసు స్వరమును వినెను. అది ఏమనగా, ‘‘ఎందుకు ఏడ్చుచున్నావు ? లోపల చర్చిలో జరిగేదంతయు డాబు, డంబము, ఈ లోక మహిమ మాత్రమే ఉన్నది. అక్కడ ఉన్నవారు నన్ను కోరుకొనరు. నీ ఆశ నేనెరుగుదును గనుకనే నేను నీ వద్దకు వచ్చితిని’’ అని చెప్పెను. ఈ మాటలు చెప్పుచు ప్రభుయేసు తన హస్తము అతనిపై ఉంచి దీవించెను.

 ప్రియ మిత్రులారా, మన పూర్ణ హృదయముతో యేసును వెదకినచో మనమాయనను కనుగొందుము. 1 కొరింథీ 6:18లో పౌలు మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నది. గనుక మనము జారత్వమునకు దూరముగా పారిపోవలెననియు మన దేహముతో దేవుని మహిమపరచవలెనని వ్రాయుచున్నాడు. కావున ఆయన కుమారుని అమూల్య రక్తముతో మన పాపాలన్ని పవిత్రపరచుమని మొదటగా మనము ప్రార్థించవలెను. రెండవదిగా, విరిగి, నలిగిన హృదయమును దేవుడు లక్ష్యము చేయును (కీర్తన 51:17). దేవుడు అహంకారులను ఎదిరించి, దీనులకు కృప అనుగ్రహించును అని 1 పేతురు 5:5 చెప్పుచున్నది. గనుక మనము పరిశుద్ధముగాను, దీనులముగాను ఉండి, ప్రభువైన యేసును మన హృదయంలోనికి ఆహ్వానించి మన జీవితాలలో ఆయన ఆశీర్వాదము పొందుదము.
ప్రార్థన :` ప్రియ ప్రభువా, నీవు పెద్దపెద్ద ఆలయాలలోనో లేక నిన్ను ఘనపరచలేని జనులుండి చర్చిలలోనో ఉండు దేవుడవు కావు. నిన్ను శ్రద్ధగా వెదకు వారివద్దకు, పరిశుద్ధముగాను, దీనులుగాను ఉన్నవారి ఆత్మలతోను నీవు నివసించువాడవు. నా పూర్ణహృదయముతో నిన్ను వెదకునట్లు నాకు సహాయము చేసయుమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page