28, ఆగప్పు 2025 గురువారము || చురుకురగాను, సమర్థవంతంగాను ఉండుము
- Honey Drops for Every Soul
- Aug 28
- 1 min read
తేనెధారలు చదువుము : మత్తయి 9:18-26
“పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు” - సామె 18:9
మనకు నియమింపబడిన పని చేయుటకు మనము చురుకుగాను, సమర్థ్ధవంతముగాను,
తెలివిగాను ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు. అది ఏదైన పని, ఉద్యోగం కావచ్చు, వంట
లేక బోధించుట లేక ఇంకేదైన కార్యాలయ పని కానే కావచ్చు. మనము చురుకుగాను అదే
సమయంలో సమర్థవంతంగాను ఉండునట్లు సృష్టింపబడిన వారము. మన సోమరితనమే మనలను ఉదాసీనముగాను, అసమర్ధముగాను ఉండునట్లు చేయును. కొందరు ఎంతో వేగముగా
పనిచేయువారుగా ఉన్నను వారి పని అంత బాగా ఉండదు, అలాగే సమర్థవంతంగా పనిచేయువారందరు కానీ వారి పని ఎంతో ఉదాసీనంగా ఉండును. సమర్ధవంతంగాను, అలాగే ఎంతో వేగంగా, చురుకుగా మనము పని చేయవలసిన అవసరమున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము వురికొల్పబడుదము. ఆయన ఎల్లవేళల చురుకుగా ఉందేవాడు. “దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్దాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడాయనకు తోడైయుందెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెనూ అని అపో.కార్య 10:38 చెప్పుచున్నది. యేసు సమయమును వ్యర్ధపరచినట్లు మనము ఏ లేఖనమును చదివియుండలేదు. కొన్నిసార్లు ఆయనకు తినుటకు లేదా నిద్రించుటకు కూడా సమయం లేకుండుట వాస్తవమే. తండ్రి అప్పగించిన పనినే ఆయన ఎల్లవేళల చేయుచుండెను. అలాగని ఆయన తొందరపాటుగా లేడు. యేసుప్రభువు యాయీరు కుమార్తె చనిపోయియున్న స్థితిలో వారి ఇంటికి వెళ్ళు మార్గంలో 12 సం॥ల నుండి రక్తస్రావ రోగము గల ప్రీ వచ్చి ఆయనను ఆటంకపరచినది. అప్పుడు ఆయన ఆమెను ప్రక్కకు త్రోసి, యాయీరు
ఇంటికి వెళ్ళుటకు త్వరపడలేదు గానీ, ఆమెను శారీరకంగాను, ఆత్మీయంగాను స్వస్థపరచిన
తరువాతనే తన పరిచర్య చేయుటకు కొనసాగి వెళ్ళెను.
కావున ప్రియ మిత్రులారా, కొన్ని విషయాలను వాయిదా వేయక కొలస్సీ పత్రికలో పౌలు చెప్పినట్లుగా మనుష్యులకు చేసినట్లు కాక అది దేవుని కొరకు చేస్తున్నట్లు హృదయపూర్వకముగా చేయుదము.
ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నేను చేయు పనిలో సోమరిగాను, నిర్లక్ష్యంగాను ఉండక కొన్ని పనులు చేయక విడిచిపెట్టి తొందరపడి మరొక పని కొరకు వెళ్ళకుందా సాయము చేయుము. మందకొడిగాను, సోమరితనంతోను ఉండువారిని నా శక్తి సామర్థ్యం ద్వారా పురికొల్పుటకు యేసుప్రభువు యొక్క మాదిరి ననుసరించునట్లు కృపచూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments