27, ఆగప్పు 2025 బుధవారము || యేసు అడుళుజాడలయంచు నడుచుచము
- Honey Drops for Every Soul

- Aug 27
- 1 min read
తేనెధారలు చదువుము : మత్తయి 4;1-11
“నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాక మునుపే తెరచుకొందును” - కీర్తన 119: 148
ఒక తండ్రీ, కూతుళ్ళు బురదగా ఉన్న ఒక పొలములో నడుచుచుండగా తన వెనుక నడుచుచు వస్తున్న కుమార్తెను చూచి “జాగ్రత్త, నీ కాళ్ళకు బురద అంటకుండా చూచుకో” అని చెప్పెను. అప్పుడా కుమార్తె ధైర్యంగా “నీ అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాను గనుక నీ పాదాలకు బురద అంటకపోతే నా పాదాలకు కూడా అంటదు” అని చెప్పినది. మన జీవితాలలో సాతానును, వాని కుయుక్తులను మనము ఓడించవలెనంటే ప్రతి విధముగాను సాతాను నోడించిన మన ప్రభువైన యేసు అడుగుజాడలను అనుసరించుట చేతనే ఆ “బురద” అంటకుండ చూచుకొనగలము. యేసును పాపములో చిక్కించుకొనవలెనని సాతాను చేసిన అత్యంత బాహాటమైన దాడి ఏదనగా ఆయన పరిచర్య ఆరంభంలో ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే 40 దినాలు ఉపవసించి, ప్రార్ధించుటకు అరణ్యంలోనికి వెళ్ళిన సందర్భములోనె. ఆయన శరీరము బలహీనమవగా ఆయనను శోధించుటకు సాతాను మెల్లగా దరిచేరినది. కానీ, వాడి కుయుక్తులకు.ఆయన ఏ మాత్రము ఎరకా లేదు. లేఖనాలెత్తి పట్టి ఆయన వాని నోడించెను. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది కావుననే “దేవుని వాక్యము సజీవమై, బలముగలదై రెండంచుల వాడిగల ఎటువంటి ఖద్దము కంటెను వాడిగలది” అని వివరించబడినది. (హెబ్రీ 4:12)
ప్రియ మిత్రులారా, తరచుగా సాతాను మనలను కూడా శోధించుటకు చూచును, ప్రత్యేకించి మనము ఎంతో చురుకుగా దేవుని పరిచర్య చేయుచున్నప్పుడు, మనము మెలకువ లేక జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఏమి జరుగుచున్నదో మనకు తెలియక ముందే మనలను పడవేయుటకు వాడు అవకాశము తీసికొనును. ఇటువంటి సమయంలో సాతాను నోడించుటకు యేసు చేసినట్లు దేవుని వాక్యము నెత్తిచూపుటయే మార్గము. సాతానుడే వాక్యము చూపితే మనమెంతగా వాక్యము తెలిసికొనియుండి ఎత్తి చూపవలెను. గనుక మన మనస్సులను దేవునితోను, ఆయన వాక్యముతోను నింపుకొందము. అప్పుడు సాతానుకు చోటుండదు. దేవుని వాక్యమును చదివి, ధ్యానించుదము. కంఠస్థము చేయుదము. సాతాను మనలను శోధింప ప్రయత్నించినప్పుడు వాడిని పారద్రోలుటకు దానిని (వాక్యమును) ఉపయోగించుదము.ప్రార్దన :- పరమ తండ్రీ, సాతాను గర్జించు సింహమువలె ఏ సమయమందైన నన్ను మ్రింగవలెనని తిరుగుచున్నాడు. వాడికి ఎర కాకుండా యేసు చేసినట్లే వాక్యమను గుర్హు పెట్టుకొని దానిచేత వాడిని పారద్రోలుటకు కృప ననుగ్రహించుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments