top of page

26, ఆగప్పు 2025 మంగళవారము || నీ ఎంపిక సరైనబైనా ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 26
  • 1 min read

తేనెధారలు చదువుము : యెహోషువ 24:13-15;



“... నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము” - యెహోషువ 24:15


ఈ జీవితంలో మంచి, చెడులు మరియు తప్పు, ఒప్పు దేవుని మార్గము మరియు లోక విధానాల మధ్య ఎల్లప్పుడు మనము సతమతమగుచుందుము. మనము దేవుని మార్గాలను గానీ ఈ లోక మార్గాలను గానీ ఎన్నుకోవచ్చు. ఇద్దరు యజమానులకు మనము సేవ చేయలేము అని మత్తయి 6:24 చెప్పుచున్నది. ఎన్నటికి చేయలేము ! ఎంచుకొనుట తప్పనిసరి ! ఈ దిన వాక్యభాగములో ఇద్దరు వ్యక్తులను గూర్చి మనము చదువుదుము. ఒకరు సరైనదే ఎంచుకొన్నవాడు - యెహోషువ, మరొకరు తప్పుగా ఎంపిక చేసికొనిన లోతు. మోషే మరణించిన తరువాత యెహోషువ సరైన ఎంపిక చేసికొనెను. దేవునికి లోబడి అపనమ్మకమైన ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించెను. అతదెన్నో యుద్దాలు చేయవలసి వచ్చెను, ఎన్నో సవాళ్ళను ఎదుర్శొనవలసి వచ్చెను. అయినను తన జీవితం ముగింపులో తాను ఎంచుకొనిన దానిని బట్టి యెహోషువ ఏ విధంగాను చింతించలేదు. షెకెములో అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి, దేవునికి భయపడి, నమ్మకముగా ఆయనను సేవించవలెనను సరైన తీర్మానము తీసికొనుటకు వారిని ప్రోత్సాహపరచెను. మరొకప్రక్క లోతు మాత్రము తన శరీరానుసారమైన మనస్సుతో తాను నివాసముండు ప్రదేశమును ఎంచుకొనెను. తన చెడ్డ ఎంపికను బట్టి అతడెంతో శ్రమనొందెను. అతని కుమార్తెలు తమ భర్తలను కోల్పోయిరి. అతని భార్య ప్రాణము పోగొట్టుకొనెను మరియు తనకు తెలియకుండానే మోయాబీయులు, అమ్మోనీయులు అను దుష్ట సంతతికి కారకుడాయెను. దేవుని దృష్టిలో ఘోర దుష్టత్వము చేసిన తన కుమార్తెల ద్వారానే ఇది జరిగెను.


ప్రియ మిత్రులారా, జీవిత భాగస్వామిని ఎంచుకొనుటలో గానీ, మంచి స్నేహితుల విషయంలోగానీ, సరైన ఉద్యోగము ఎంచుకొనుటలో గానీ పరిశుద్దాత్మ నడిపింపుపై ఆధారపడి జా(గ్రత్తగా ఎంచుకొనవలసిన అవసరమున్నది. సరైన ఎంపికలు ఆశీర్వాదాలను తెస్తే తప్పుడు ఎంపికల బాధ, నాశనమును తెచ్చునని మనము గుర్తుంచుకొందము.
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, సరైన ఎంపిక చేసికొనుటకు వివేచనాత్మనిమ్ము, ఈ లోక విషయాలపై దృష్టియుంచక నీ మార్గాలననుసరించి, నీకు భయపడి, నిన్ను సేవించు కృపనిమ్ము పరిశుద్ధాత్మ, సరైన ఉద్యోగము మంచి స్నేహితులను, సరైన జీవిత భాగస్వామిని కూడా ఎంచుకొనునట్లు నన్ను నడిపించుమని యేసు నామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page