25, సెప్టెంబరు 2025 గురువారము || దైవ జ్ఞానమును ఆసక్తితో ఆపేక్షించుము
- Honey Drops for Every Soul
- Sep 25
- 1 min read
తేనెధారలు చదువుము : యాకోబు 3:13`18
‘‘జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, .... వెండి సంపాదించుట కంటె జ్ఞానము సంపాదించుట మేలు.’’ - సామె 3:13,14
తగిన సమయమందు సరైనది చేయుటకును, సరైనది సరైన సమయమందు చెప్పుటకును, అలాగే తగిన సమయమందు తగిన తీర్మానము చేయుటకును ఓర్పు కలిగి యుండుటను జ్ఞానము అని చెప్పవచ్చు. ఈదిన వాక్యభాగములో రెండు విధాలైన జ్ఞానమును గూర్చి మనము చదువుదుము. మొదటిది భూసంబంధమైనది, అది అపవాదికి సంబంధించిన ఆత్మను సారమైనది కాదు. రెండవది, పైనుండి వచ్చినదైయుండి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణjైునను లేనిదైయుండును. పైనుండి వచ్చు దేవుని జ్ఞానమును మనము ఆసక్తితో కోరుకొందము. ఈదైన జ్ఞానము మనకెందుకు అవసరము
మొటమొదటిగా, జ్ఞానము మనకు ఆనందమునిచ్చును. దైవజ్ఞానము కొదువైయున్న వ్యక్తి భయముతోను, సందేహముతోను, చింత దు:ఖముతోను నిండియుండును. రెండవదిగా, దైవజ్ఞానము గల వ్యక్తి ఘనత పొందును. (సామె 3:16) ఈ భూమిపై నడిచిన వారందరిలోను యేసుక్రీస్తు ఎక్కువ జ్ఞానము కలిగియుండెను. ఆయన మాట్లాడిన ప్రతిసారి వినినవారందరు ఆయన నోటనుండి వచ్చిన జ్ఞానము గల మాటలకు ఆశ్చర్యపడి, విభ్రాంతి నొందిరి. ఆ విధముగా ఆయన జనుల మధ్య ఘనపరచబడెను. మూడవదిగా, దైవ జ్ఞానము గల రాజైన సలోమోను ఈ లోకములో జీవించినవారిలో సంపన్నుడు కూడా. నాల్గవదిగా, జ్ఞానము గలవాడు దీర్ఘాయుష్షునొందును (సామె 3:16). అన్నిటినిమించి జ్ఞాని ఆత్మలను రక్షించగలడు. మరొక మాటలో చెప్పవలెనంటే ఆత్మలను సంపాదించువారు జ్ఞానులు. (సామె 11:30) ‘‘జ్ఞానము పగడముల కంటె ప్రియమైనది, నీ యిష్ట వస్తువులన్నియు దానితో సమానములు కావు’’ అని సామె 3:15 చెప్పుచున్నది. కావున అనుదినము దేవుని జ్ఞానముతో నింపబడుటకు ఆసక్తితో కోరుకొందము.
ప్రార్ధన: ప్రియ ప్రభువా, నేను మేలైనది చేయుటకు, మంచి విషయాలే మాట్గాడుటకును, ఎల్లవేళల సరైన నిర్ణయాలు చేయుటకును అనుదినము నీ జ్ఞానముతో నింపుము. నా జీవితము ఆనందము, సమాధనముగా ఉండునట్లు నా అనుదిన పరిస్ధితులను నీ జ్ఞానముతో చక్కదిద్దుకొను కృపనిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments