top of page

25, నపంబర్ 2024 సోమవారము || తేనెధారలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Nov 25, 2024
  • 2 min read

చదువుము : కీర్తన 51:6,7,10,11

ఆగి, పరిశీలించి ముందుకుసాగిపో !


‘మార్గములలో నిలిచి చూడుడి... మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి...’’

-యిర్మీయా 6:16



మోటారు పందెములలో వాహనాలు ఆగి, ఇంధనము నింపుకొనుటకు, ఏదైన రిపేర్లు చేసికొనుటకును లేదా డ్రైవరు మారుటకును పిట్ స్టాప్ అను ఒక స్థలము ఉండును. ‘‘ఇది కార్లు తక్కువ ఇంధనము ఉపయోగించునట్లును దానిని బట్టి అది తేలికగాను, వేగంగాను వెళ్ళునట్లును, దానిని బట్టి అది తేలికగాను, వేగంగాను వెళ్ళునట్లును ఉపయోగపడును. పందెములో విజయము పొందుటకు ఈ స్టాపులను ఎంచుకొనుటలోనే దాగి ఉన్నది’’. ఈ నియమమును మన వ్యక్తిగత మరియు కుటుంబ, విశ్వాసుల బృందాల జీవితాలలోను అన్వయించుకొనవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు ఇట్టి స్టాపులు మనము సరైన మార్గములో వెళ్ళి దేవుడు మనకు దాచియుంచిన వాటితో ప్రయాణించుటకు అవసరమైయున్నది. ఇది మనము విశ్రాంతి తీసికొనుటకును, శక్తి పొందుకొనుటకును, మన ఆత్మీయ పరుగుపందెములో మనలను మనము పరిశీలించుటకును మనకు అవకాశమిచ్చును. ఈ పందెముతో మనము ఒక్కొక్కరము డ్రైవర్లము, మన కుటుంబములు ఆ స్టాపు వద్ద ఉండు పనివారు మరియు ఆ కార్లన్నియు మన పరలోక తండ్రికి చెందినవి.



ప్రియ మిత్రులారా, ఈ పిట్ స్టాపులో మనము ఆగునప్పుడు మన జీవితమును అంచనా వేయుటకు బైబిలే ప్రమాణము. దీనిలో ఉన్నవన్ని నెరవేర్చినట్లయితే అప్పుడు మనము పందెములో గెలిచుదుమను నిశ్చయత ఉండును. మొట్టమొదటి, ముఖ్యమైన షరతు ఏమనగా రక్షణ. ఎవరైనను తన పాప మార్గాలను విడిచి యేసు రక్తము చేత కడగబడకపోతే అతడు ఆ పందెమునకు అనర్హుడగును. జారత్వము, అపవిత్రత, ద్వేషము, ఆగ్రహము, కోపము, విగ్రహారాధన మొ॥ పాప స్వభావమును మన జీవితాల నుండి తప్పక తొలగించుకొని, దానికి బదులుగా పరిశుద్ధాత్మ పూర్ణులవవలెను. క్రీస్తునందు విజయవంతముగా బ్రదుకవలెనంటే పరిశుద్ధాత్మ  మాత్రమే మనకు శక్తిననుగ్రహించును. రెండవదిగా, దేవుని వాక్యధ్యానము, ప్రార్థన ద్వారా మన ప్రభువుతో మనము సన్నిహిత సంబంధము కలిగియుండవలెను. అప్పుడే దేవునికేది యిష్టమో మనము తెలిసికొని, మన జీవితాలలో ఆయన చిత్తము చేయగలము. మరియు మన ఆత్మీయ పొరపాట్లను పరిశీలించుకొనగలము. వీలైనంత తరచుగా పిట్స్టాప్ వద్ద ఆగుదము. ప్రతి స్టాపు వద్దనుండి నిబద్ధతతోను, ధైర్యముతోను బయటకు వచ్చి చివరకు ‘‘నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించిని... ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడియున్నది’’ అని 2 తిమోతి 4:7,8లో పౌలు చెప్పినట్లు పందెమందు గెలిచి చెప్పగలము.


ప్రార్థన :- జయమునిచ్చు దేవా, నా ఆత్మీయ పరుగుపందెములో పిట్స్టాపు వద్ద కొంతసేపు ఆగునట్లు కృపనిమ్ము. నీకు అసహ్యమైన వాటిని తొలగించుకొనుటకు సహాయము నిమ్ము. నాలో శుద్ధ హృదయము కలుగజేసి, నీ పరిశుద్ధాత్మతో నింపి, విజయవంతముగా బ్రదుకుటకు దయతో సాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page