25, ఆగపు 2025 సోమవారము || ఎంతవిలువైన త్యాగము!
- Honey Drops for Every Soul
- Aug 25
- 1 min read
తేనెధారలు చదువుము : 1 యోహాను 3:16-19; 4:7-12
“... మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై యున్నాము” - 1 యోహాను 3:16
“కరములు జోడించి ప్రార్ధించుచున్నట్లున్నో చిత్రము వెనుక ఉన్న హృదయము ద్రవించు కథనమును గూర్చి మనలో అనేకులము ఎరుగము. 15వ శతాబ్దములో 18 మంది పిల్లలు గల కుటుంబంలోని ఇద్దరు కుమారులైన ఆ్షైక్ట్ మరియు ఆల్బర్ట్ డ్యూరర్‌లు న్యూరెంబర్ట్ అకాడమీలో చిత్రకళలో చదవుకోవాలని ఆశించిరి. వారి తండ్రి చదివించలేని పేదవాడు గనుక వారు బొమ్మా, బొరుసు చూచి, ఓడిపోయినవారు దగ్గరలో ఉండిన గనులలో పనికి వెళ్ళి ఆ సంపాదనతో తన సహోదరుని చదివించుటకును, ఆ నాలుగు సం॥ల కాలపరిమితి తరువాత అతడు మరొక సహోదరునికి సహాయం చేయుటకు తీర్మానించుకొనిరి. దాని ప్రకారమే ఆ్ర్రైక్ట్ గెలిచి నూరెంబర్ల్‌కు వెళ్ళగా ఆల్బర్ట్ (ప్రమాదకరమైన ఆ గదిలో పనిచేసి తన సోదరునికి సహాయం చేసెను. 4 సం॥ల తరువాత ఆ యవ్వన చిత్రకారుడు తిరిగి వచ్చి “ఇప్పుడు నీవు వెళ్ళీ చదువుకొనుమని” ఆల్బర్ట్‌తో చెప్పగా ఆల్బర్ట్ కండ్ల నుండి కన్నీళ్ళు కారుచు ఎంతో నెమ్మదిగా “లేదు సోదరా, నేను వెళ్ళలేను. ఇప్పటికే ఆలస్యమైపోయినది. నా ప్రతి వ్రేలి ఎముకలు నలిగిపోయి, కీళ్ళ వ్యాధితో నా కుడిచేయి ఇబ్బంది పెట్టుచున్నది. నేనే మాత్రము సున్నితంగా గీయవలసిన ఆ చిత్రాలను గీయుటకు పెన్ను (కలము) పట్టుకొనలేను” అని చెప్పెను. ఆల్షెక్ట్ ఎంతో వేదనతో తన సోదరుని గౌరవార్థము నలుగగొట్టబడిన తన ప్రియ సోదరుని ముకుళిత హస్తాలు ఆకాశం వైపు చాపినట్లున్న చిత్రమును చిత్రించి “ప్రార్ధించు చేతులు” అని పిలువబడుచున్న ఆ చిత్రానికి అతడు “చెతులు” అని పేరు పెట్టెను.
ప్రియ స్నేహితులారా, ఈ సంఘటన మన సహోదర, సహోదరీల పట్ల మనలో (ప్రేమను రగిలించి వారి క్షేమము కొరకు మనలను మనము సమర్పించుకొనుటకు సిద్దపరచును గాక. ఈ బొమ్మలో (ప్రాణము ఉన్నది అని గ్రహించాలి.
ప్రార్ధన :- ప్రేమగల దేవా, నా సోదర, సోదరీలు శ్రమనొందుట చూచి వారి సమస్యలను చూచి చూడనట్లుండక భౌతికంగా గానీ, ఆర్జికంగా గానీ, ఆత్మీయంగా గానీ నా సహాయం వారినందించుటకు సిద్ధపడుటకు కృపనిమ్ము. దినదినము వారిపట్ల నా ప్రేమ అధికమగునట్లు దయచేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments