top of page

24, సెప్టెంబరు 2025 బుధవారము || ఎడబాయని ఆయన ప్రేమ గొప్పది

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 24
  • 1 min read

తేనెధారలు చదువుము : యోబు 42:10-17


‘‘ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును.’’

- విలాప వాక్యా 3:32


మన క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలనుభవించుచున్నప్పుడు తల్లడిల్లుపోదుము. కానీ దైర్యము తెచ్చుకొందుము. మన సమస్యలన్నిటికి నిశ్చయంగా ఒక అంతము కలదు, ప్రభువు మనలను సర్వకాలము విడనాడడు. (విలా. వాక్యా 3:31) యోసేపు తన పదిహేడు సం॥ల యవ్వన కాలంలోనే శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చెను. దాదాపు 13 సం॥లు సమస్య వెంబడి సమస్య నెదుర్కొనెను. అయితే దేవుడు అతని విడిచిపెట్టలేదు. ఆయన అతనికి దయచూపి ఐగుప్తు ప్రధానిగా హెచ్చించెను. యోబు జీవితమును చూడుడి. ఆయన భౌతికంగాను, మానసికముగాను ఎంతో వేదనననుభవించెను. అయితే ఆ శ్రమలు ముగిసిన పిదప యోబు మునుపెన్నడు అనుభవించని దేవుని విడవని ప్రేమను పొందెను. ‘‘యోబును దేవుడు తన జీవిత మొదటి భాగము కంటే తరువాత కాలములోనే మరెక్కువగా దీవించెను’’ అని యోబు 42:12లో చెప్పుచున్నది. మరియు 16 వచనము చెప్పుచున్నదే మనగా ‘‘ఆ తరువాత యోబు 140 సం॥లు జీవించి తన పిల్లల పిల్లలను నాలుగు తరాల వరకు చూచెను. 


 ప్రియమిత్రులారా, శ్రమ, రోగము అను లోయలో మనము నడుచునప్పుడు మనమధైర్య పడకయుందము, ఎందుకనగా దేవుడు మనకు సమీపముగా ఉండు కాలమదియే. మన సమస్యల వైపు చూచుటకు బదులుగా మన ఆత్మ నేత్రాలు తెంచి మనతో నడుచుచున్న మన కృపగల దేవుని చూచుదుము. యెహోవా 1:5లో ‘‘నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును తోడుగా ఉందును. నిన్నెడను విడవను ఎడబాయను’’ అని ఆయన వాగ్ధానము చేసియున్నాడు. అలాగే ద్వితి.కాం 31:6లో ‘‘నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువక, నిన్నెడబాయడు’’ అని ఆయన వాగ్ధానము చేసెను. వాగ్ధానము చేసినవాడు నమ్మదగినవాడు. కావున ఎడబాయని ఆయన ప్రేమయందు నమ్మిక యుంచి, వాగ్ధానాలను గట్టిగా పట్టుకొని శ్రమల నుండి జయమొందుదుము. 

ప్రార్ధన :` సర్వశక్తి గల దేవా, నేనీ శ్రమల మార్గము లోబడి వెళ్ళుచుండగా నీ యందు నమ్మిక యుంచి నిరీక్షణతో వాటిని హత్తుకొని యుందును. ఈ శ్రమలు కొద్దికాలమేయనియు నిశ్చయముగా నన్ను విడిపించుదువని నమ్ముచు, యేసునామమున ప్రార్ధిస్తున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page