24, నవంబర్ 2024 ఆదివారము || తేనెధారలు
- Honey Drops for Every Soul
- Nov 24, 2024
- 1 min read
చదువుము : మత్తయి 7:7-11
పరిశుద్ధాత్మ దేవా, నిండుగా అంచుల మట్టుకు నన్ను నింపుము
‘‘ఆత్మను అర్పకుడి’’ - 1 థెస్స 5:19
ఒక క్రైస్తవునికి తన ఆత్మీయ జీవితములో అత్యవసరమైనది. పరిశుద్ధాత్మతో నింపబడుటయే. సువార్త ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకును, సాక్షులుగా ఉండుటకును యేసు తన శిష్యులను ఈ పాప లోకములోనికి పంపుటకు ముందు పరిశుద్ధాత్మను పొందువరకు యెరూషలేములోని వేచియుండుమని ఆజ్ఞాపించెను. అ.కార్య. 1:8లో ‘‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందుదురు. అప్పుడు యూదయ, సమరయ దేశములలోను, భూదిగంతములవరకును మీరు నా సాక్షులైయుందురని’’ యేసు వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభువు పరిచర్య మనము బలంగా చేయలేము గనుక పరిశుద్ధాత్మ శక్తి మనకు ఎంతో విలువైనది. కోరీ టెన్ బూమ్ ఈ విషయమును ఒక చక్కని ఉదాహరణతో వివరించెను. చేతికి వేసికొను తొడుగు (గ్లోవ్) తనంతట తానేమి చేయలేదు కానీ దానిని ఎవరైన తొడుగుకొంటే దానితో ఎంతైనా చేయవచ్చు. దానితో వంట చేయవచ్చు, వ్రాయవచ్చు, ఇంకను అనేకమైన పనులు చేయవచ్చు. పనిచేసేది ఆ గ్లోవ్ కాదుకానీ దానిలో ఉన్న చేయి మాత్రమా. చేయి అంతయు దానిలో పెట్టకుండా ఒక వ్రేలు మాత్రమే పెట్టినట్లయితే ఏ ప్రయోజనము ఉండదు. మన విషయం కూడా అంతే. మనము ఆ తొడుగులమైతే పరిశుద్ధాత్మ ఆ చేయిjైు యుండి సమస్తము చేయగలదైయుండును. అయితే మన పూర్తి జీవితము ఆయనకియ్యవలసి యున్నది. ఎఫెసి 5:18లో ‘‘ఆత్మపూర్ణులైయుండుడి’’ అని పౌలు చెప్పుచున్నాడు. మన జీవితాల నుండి కొన్ని స్నేహాలు, కొన్ని అలవాట్లు, వ్యక్తిగతమైన ఇష్టాలు మొ॥గు యేసును వెంబడిరచకుండా అడ్డుకొను కొన్ని విషయాలను తొలగించుకొన్నప్పుడే పరిశుద్ధాత్మ మనలను నిండుగా అంచుల మట్టుకు నింపగలుగును. అప్పుడు మాత్రమే ఆయన మనలను బలంగా వాడుకొనగలడు. అప్పుడు మాత్రమే మనలోను, మననుండి ఆయన గొప్ప కార్యాలు చేయునట్లు మనమాశించవచ్చు.
ప్రియ మిత్రులారా, మన జీవితాలనుండి అనవసరమైనవన్ని తొలగించుటకు వెనుకాడక, మన జీవితాలను, మన హృదయాలను పరిశుద్ధాత్మ స్వాధీనమునకు అప్పగించుకొని, అనుమతించుదము.
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, మరి మరి నీ పరిశుద్ధాత్మతో నింపబడి, విశేషంగా నా జీవితమంతయు, నా హృదయమంతయు నీకే ఇచ్చునట్లు నాలో చోటు చేసికొనిన ఈ లోకపరమైన అపవిత్రమైన విషయాలను తొలగించుకొనుటకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించు చున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments