23, సెప్టెంబరు 2025 మంగళవారము || దేవుడు నీ కన్నీటిని చూచును
- Honey Drops for Every Soul

- Sep 23
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 30:1,12
‘‘నీవు కనీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థననంగీకరించియున్నాను, నేను నిన్ను బాగు చేసెదను.’’ - 2 రాజులు 20:5
తన ప్రియ బిడ్డల ప్రార్ధనలను దేవుడెన్నడు త్రోసివేయడు, లేక మరవడు. మరి ముఖ్యముగా విరిగి నలిగిన హృదయములలోను, కన్నీటితోను తన పిల్లలు చేయు ప్రార్ధనలు. కీర్తన 56:8లో దావీదు ‘‘నా కనీళ్ళు నీ బుడ్డిలో నుంచబడియున్నవి గదా’’ అని దేవునికి విజ్ఞాపన చేయుచు చెప్పుచున్నాడు. తన బుడ్డిలో దావీదు కనీళ్ళు దాచమని దేవుని అడుగుచున్నాడంటె దావీదు ఎన్ని కనీళ్ళు కార్చునో ఊహించుడి ! అంతేకాదు ఎంత వేదననుభవించెనో కదా !
ప్రియ మిత్రులారా, మీ జీవితంలో పలు విధాల సమస్యలు పునరావృత్తమగుట వలన నీ కన్నులు నుండి కన్నీటి ప్రభావము పారుచున్నదా ? గుర్తుంచుకొనుడి, మీరు కార్చిన ప్రతి బాష్పబిందువు దేవుని బుడ్డిలో చేర్చబడినది. మీ విలాపములన్నియు ప్రభువు లిఖించియున్నాడు. మీ కన్నీటిని చూచుచున్న మిమ్మునెన్నడు విడనాడడు. యేసుప్రభువు యొక్క సన్నిహిత స్నేహితుడు మరణించినప్పుడు ఆయన ఆత్మలో ఎంతో కదిలింపబడి, కలవరపడి ఏడ్చెను. (యోహాను11:3,35) ఒకప్పుడు యేసు యెరుషలేమును చూచి ఏడ్చెను. ఆయన అంతటి కనికరముగల దేవుడు. భర్త చనిపోయియున్న ఒక స్త్రీ తన ఒక్కగానొక్క కుమారుడు మరణించినప్పుడు ఆమె పట్ల ఆయన కనికరపడి దగ్గరకు పోయి ‘‘ఏడ్వవద్దు’’ అని చెప్పి ఆయన ఆమెను ఓదార్చెను. (లూకా 7:13) హాగరుకేమి సంభవించెనో జ్ఞాపకము చేసికొంటే, ఆమె ఎడారిలో సంచరించుచు త్రాగుటకు నీరు లేక తన కుమారుడు మరణించు సమయాన ఆమె ఎంతో ఆర్ధ్రతతో దేవుని వేడుకొనెను. ఆయన ఆమె మొఱ్ఱ ఆలకించి నీటి ఊటను ఆమెకు చూపెను. ఆయన ఆ తల్లి, కుమారులిద్దరి ప్రాణాలను కాపాడెను. అట్టి ప్రేమ, కనికర సపన్నుడైన దేవుడు నీ మొఱ్ఱను పెడచెవిని పెట్టునా లేదు ! ఎన్నటికిని ! నిశ్చయముగా ఆయన నీ కన్నీటిని తుడిచివేయును, గనుక సంతోషించి, ఆనందించుము !ప్రార్ధన :` పరమ తండ్రీ, నిరాశలోనేనుండి మొఱ్ఱపెట్టునప్పుడు నీవెన్నడు నన్ను విడువవని నిశ్చయతను కలిగించినందుకు వందనాలు. నాకు సహాయము చేసి, లేవనెత్తి, నా సమస్యలన్నిటినుండి విడిపించుటకు నీవు తప్పక వేగిరమే వచ్చెదవని నేనెరుగుదును. నీవు నిశ్చయముగా నా దు:ఖమును సంతోషముగా మార్చుదువని, స్తుతించుచు యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments