23, ఆగప్పు 2025 శనివారము || మరుదాచుకానుచున్నారా ? లేక దొోచుచున్నారా?
- Honey Drops for Every Soul

- Aug 23
- 2 min read
తేనెధారలు చదువుము : మత్తయి 6:19-21; 1 తిమోతి 6:6-11
“మన మీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము”- 1 తిమోతి 6:7
అంత్య దినాలలో “మనుష్యుల న్వార్థ(వ్రీయులు, ధనాపేక్షులు... దేవుని కంటె
సుఖానుభవమునెక్కువగా ప్రైెమించువారు ఉందురు” అని బైబిలు ఎంతో స్పష్టముగా చెప్పుచున్నది. (2 తిమోతి 3:2-4) లోక సంబంధమైన వాటికొరకు దురాశ లేక భోగేచ్చలకు చోటియ్యకుండ జాగ్రత్తపడుదము. రాన్ హబ్‌క్రాఫ్ట్‌గారు తన స్నేహితురాలు మరియు ఆమె 5 సం॥ల కుమారుని మధ ప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చిన సంభాషణను గూర్చి జ్ఞాపకం చేసికొనెను. తెలివైన ఆ బాలుడు తన తల్లిని ఒక ఊహించని ప్రశ్న అడిగెను. “అమ్మా, మనకొరకు
యేసుప్రభువు పరలోకంలో ఒక చక్కని భవనం కట్టుచున్నాడని నీవు నాకు చెప్పలేదా ? అప్పుడామె
“అవును నిజమే” అనగా ఆ బాలుడు ఆమెను తేరిచూచి “అలాగైతే ఇప్పటికే మనకు రెండు ఇళ్ళు ఉన్నవి కదా. ఒకటి ఇప్పుడు మనమున్నది, మరొకటి కొండమీద ఉన్నది. గనుక ఒక్క ఇల్లు కూడా లేనివాళ్ళకు ఒక ఇల్లు ఇస్తే మంచిది కదా ?” అని చెప్పెను. గొప్ప సువార్తికుడైన హడద్చన్ టేలర్‌గారు చెప్పినదేమనగా “యేసుప్రభువు యొక్క రెండవ రాకడను గూర్చిన శు భప్రదమైన నిరీక్షణ నన్ను నా చిన్న గ్రంథాలయము (లైబ్రరి)ను పరిశీలించి అవసరము లేనివి లేక పనికిరాని పుస్తకాలేవైన ఉన్నవే మోయననియు, నా చిన్న బీరువాలోను ప్రభువు నన్ను ప్రశ్నించునట్లు లెక్క చెప్పవలసినవేవియు ఉండకుండా జాగ్రత్తగా చూచుకొంటిని*. అలాగే “ఇతరులకు అవసరమైయుండి, మన వద్దనే పెర్చి పెట్టుకొనినవి మనకవసరము లేకున్న మన దీవెనలను నిలిపివేయు వాటిని ఉంచుకొను ప్రమాదకరమైన పరిస్థితిలో మనమున్నామని నేను నమ్ముచున్నాను. సంఘ ఆదాయ వనరులన్ని చక్కగా ఉపయోగింపబడినట్లయితే ఎంతమంది పేదల ఆకలి తీర్చి వస్త్రాలు లేనివారి వస్తాలు ఇయ్యవచ్చో కదా ! మరియు సువార్త అందని ఎందరికో సువార్త అందజేయవచ్చు కదా.
ప్రియ మిత్రులారా, ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, మనము ఆయనకు లెక్కయుప్ప చెప్పవలసిన దినము కూడా సమీపమైయున్నది. కాబట్టి ఈ భూమి మీద ధనము సమకూర్చు కొనక, ఎక్కువగా ఉన్న వాటిని పేదలకు, అవసరతలో ఉన్నవారికి పంచిపెట్టుదము. ప్రభువు ఏ సమయంలో వచ్చినను ఆయన నెదుర్కొనుటకు సిద్ధముగా ఉండునట్లు పైనున్న వాటి మీదనే మనస్సు ఉంచుకొందము.ప్రార్దన :- ప్రియ ప్రభువా, నాకవసరమైనవన్నియు, నాకనుగ్రహించుచున్నందుకు వందనాలు. అయినను పేదలకు, అవసరతలో ఉన్నవారికి ఇయ్యవలెననుకొనక నా కొరకే బిగపట్టుకొని ఉంచుకొనుచున్నాను. అవసరతలో ఉన్నవారికి వాటిని పంచి ఇచ్చి, తగు మాత్రము కలిగియుండి తృప్తిగా జీవించుటకు నాకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments