22, సెప్టెంబరు 2025 సోమవారము || దీనులు బలహీనులు కారు
- Honey Drops for Every Soul

- Sep 22
- 1 min read
తేనెధారలు చదువుము : కీర్తన 22:26, 25:9
‘‘...ఆయన (యెహోవా) దీనులను రక్షణతో అలంకరించును.’’ - కీర్తన 149:4
మత్తయి 5:5లోని ధన్యతలలో ‘‘సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందురు’’ అని మన ప్రభువైన యేసు చెప్పెను. దీనులు ఎవరు సుళువుగా కోపగించు కొనకయు సమస్యను సృష్టించుటకు కాక సద్దుకొని పోవు, సాత్వికము దయగల వ్యక్తియే. దీనులు ఎలా భూమిని స్వతంత్రించుకొందురో ఈ లోకస్తులు అర్ధము చేసికొనలేరు. వారు భౌతికమైన శక్తియందు విశ్వసించుదురు. వారు భూజాలు భుజబలాలు మీద అనగా సైనము, వారి ఆయుధాలపై నమ్మకయుంచుదురు. వారి తోటివారిని బెదిరించుచు, బాధించి భయపెట్టి పెత్తనము చేయుటలో నమ్మికయుంచుదురు. దీనులు, సాత్వికులు అంటే వారి దృష్టిలో బలహీనులు, దుర్భలులు అని అనుకొందురు. కానీ, దీనులు బలహీనులు కారని వారు గ్రహింపలేకపోయిరి. దీనులు ఎన్నడు అప్రతిష్టపాలవరు. ఎందుకంటే దీనత్వము పీడనలు, హింసను, మౌనంగాను, సాత్వికముతోను, ఎంతో సుళువుగా సహించు శక్తి కలిగిన లక్షణము.
ప్రియ మిత్రులారా, దీనులుగా ఉండుటకు గొప్ప శక్తి అవసరము. క్రీస్తునందు నూతన జన్మ పొందుట ద్వారానే ఎవరైనను దీనత్వము చూపగలరు. కావున దీనులు భూలోకమును స్వతంత్రించుకొందురని చెప్పుటలో ఏ వ్యక్తిలోనైనను, క్రీస్తు ప్రభువు, మరియు దేవుని ఆత్మ నివసించునప్పుడు మాత్రమే ఇది సాధ్యమని అర్ధము. ఎటు చూచిన సమస్యలతో ఉన్నను ఎవరైనను దేవునికి గానీ మనుష్యులకుగానీ ఎదురు తిరుగత తన బాధ్యతలను నిర్వర్తించుచూ పోవుచున్నాడంటే అతడు ‘‘సాత్వికమను అద్భుతమైన గుణము కలిగియున్నాడని అర్ధము’’ అని ఒక రచయిత వ్రాసెను. మనమును దీనులమై భూలోకమును స్వతంత్రించుకొందుము. ప్రారన : పరమ తండ్రి, ఈ లోకములో జనులు వారి శక్తి సామర్ధ్యాలు, అధికారము, స్ధితిగతులు చూపుకొని ప్రయత్నించుందురు కానీ నేనైతే ఆత్మలో దీనత్వము సాత్వికము యుండ దయచేయుము. అందుచేత నా చుట్టు నున్నవారికి నాలో జీవించుచున్న క్రీస్తును వెల్లడి చేయునట్లు కృపననుగ్రహించుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments