top of page

22, ఆగష్టు 2025 శుక్రవారము || చేవుజే మన శత్రువులకు ప్రతీకారము చేయును

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 22
  • 2 min read

తేనెధారలు చదువుము : సంఖ్యా కాం. 20:14-20



“.. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే...” - ద్వితి.కాం. 32:35


మనము అన్యాయంగా శిక్షింపబదినప్పుడు, మనలను లెక్కృచేయనప్పుడు, మన పట్ల చెడుగా (ప్రవర్తించినప్పుడు అనేకసార్లు మనకు కోపము వచ్చును. ఆవేశపడుచుందుము లేక మనలను బాధించినవారిని వెంటనే ఎదిరించుచుందుము లేక మీరి మీద పగపెట్టుకొని సమయం చూచి కక్ష తీర్చుకొనుచుందుము. రోమా 12:21 చెప్పుచున్నదేమనగా “కిడుకు ప్రతి కీడు చేయక మేలు చేత కీడును జయించుము”. అలాగే 19వ.లో పౌలు, “మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి” అని చెప్పుచున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల పట్ల ఎదోమీయులు ఎలా కఠినంగా ప్రవర్తించిరో ఈ దిన వాక్యభాగంలో మనము చదువుదుము. వారు ఐగుప్పనుండి కనానుకు ప్రయాణించుచుందడగా మీ దేశంలో నుండి వెళ్ళుటకు అనుమతినిమ్మని అడుగుటకు మోషే కాదేషు నుండి ఎదోము రాజు వద్దకు ఎంతో మర్యాదగాను, తగ్గింపుతోను కొందరిని పంపించెను. తన జనులు వారి పొలములో గానీ, ద్రాక్షతోటలలో గాని పడి నదవకయు, ఏ బావులలో నుండియైనను నీరు త్రాగకయు వెళ్ళుదురను మాట కూడా ఇచ్చిను. ఎదోము రాజ మార్దములోనే వెళ్ళుదురు గానీ, కుడికి గానీ ఎదమకు గానీ తిరుగక అందరు దాటువరకు నేరుగానే ప్రయాణించుదురనియు చెప్పియుందిను. వారి పశువులేవైనను అక్కది నీరు త్రాగినట్లయితే దానికొరకు మూల్యము చెల్లించుదుమనియు వాగ్ధానము చేసెను. అయినను వారి అభ్యర్థనను ఎదోమీయులు తిరస్క్మరించుటయే కాక గొప్ప సైన్యముతో ఇశ్రాయేలీయులకు విరోధంగా వచ్చిరి. కాబట్టి ఇశ్రాయేలీయులు వేరొక మార్గాన వెళ్ళవలసి వచ్చెను. తన ప్రజలకు ఎదోమీయులు వేరొక మార్గాన వెళ్ళవలసి వచ్చిను. తన ప్రజలకు ఎదోమీయులు చేసిన కీడును దేవుడు చూచెను. ఆ తరువాత అనేక సం॥లకు యెహెజబ్మేలు (ప్రవక్త ద్వారా ఎదోమీయులకు విరోధముగా, “నీకు

విరోధంగా నా చెయ్యిచాపి నిన్ను పాడుగాను, నిర్దనముగాను చేసెదను. నీవు నిర్షనముగా ఉ ౦డునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను” అని దేవుడు సెలవిచ్చెను (యెహెజ్మేలు 35:3, 4).


ప్రియ మిత్రులారా, “యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును ఆయన మహో[గ్రత గలవాడు. ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధుడైన వారి మీద కోపముంచుకొనునుూు అని నహూము 1:2 చెప్పుచున్నది. కావున, మనమేవిధముగా ప్రతీకారము తీర్చుకొన (ప్రయత్నించక దాని విషయము దేవుడే చూచుకొనునట్లు ఆయన చేతిలో పెట్టుదము.
ప్రార్ధన :- సర్వశక్తి గల దేవా, ఎవరైనను నన్ను వారి కాళ్ళు తుడుచుకొను పట్లవలె చూచి, అవమానించి, నాకు విరోధంగా పుకార్లు పుట్టించినప్పడు నీవే దానిని చూచుకొందువని మౌనంగా ఉండి ఆ విషయమును నీకు విడిచిపెట్టు కృపనిమ్ము. నేను నీ సొత్తైయున్నాను గనుక నీవు ఎప్పుడును నన్ను హెచ్చించుదువని ఎరిగి యేసు నామమున ఈ ప్రార్దన నీకు సమర్పించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page