top of page

21 సెప్టెంబరు 2025 ఆదివారము || విడిచిపెట్టకుము! ముందుకు సాగుము! పరుగును ముగించుము!

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 21
  • 1 min read

తేనెధారలు చదువుము : హెబ్రీ 11:7-30 


‘...సిలువను సహించి, ...దేవుని సింహాసనయు యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్న యేసువైపు చూచుదము’’ - హెబ్రీ 12:2


సిక్లగును నాశనం చేసి తన భార్యలను, పిల్లలను, తనకు కలిగిన సమస్తమును దోచుకొని వెళ్ళిన అమాలేకీయులను దావీదు ఎలా ఓడిరచెనో మనము 1 సమూ 30లో చూడగలము. మొదట దావీదు ఎంతో వేదన పడి ఒక ఏడ్చుటకు శక్తి లేనంతమట్టుకు ఏడ్చెను. ఆ తరువాత తనను తాను ధైర్యపరచుకొని శక్తి కూడగట్టుకొని తన శత్రువులను దేవుని ఆలోచన చేత తరిమెను. ఫలితమేమిటి  అతడు వారిని ఓడిరచి వరు తీసుకొనిపోయిన సమస్తమును తిరిగి తెచ్చుకొనెను.


 ప్రియ మిత్రులారా, మన విరోధిjైున అపవాది మనలను బోధించునప్పుడు మన ఆత్మీయ పరుగు నుండి వైదొలగకయుందము. మన ప్రభువైన, మనలను ధైర్యపరచు గొప్ప నాయకుని చేత నడిపింపబడిన గొప్ప సాక్షి సమూహము చేత మనమావరింపబడి యున్నాము. (హెబ్రీ 12:1) వారు మునుపే మనకు ముందుగా పరుగెత్తి, ముగించినవారై యున్నారు. ‘‘మీరు విడిచిపెట్టవద్దు ! దీనిని మీరు చేయగలరు!’’  అని ఇప్పుడు వారు మనలను ధైర్యపరుచుచున్నారు. నోవహు అంటున్నాడు, ‘‘ఎందరు దుష్టులు హేళన చేసినను నేను ఓడను కట్టి ముగించగలిగితే మీరును చేయగలరు’’ అని బిగ్గరగా చెప్పుచున్నాడు. అబ్రహము ‘‘దేవుడిచ్చిన వాగ్ధానము కొరకు నేను 25 సం॥లు వేచియుంటే మీ హృదయవాంఛను నెరవేరును’’ అని కేక వేసి చెప్పుచున్నాడు. యోసేపు ‘‘నేను గోతిలో త్రోయబడి, పోతిఫరు ఇంటిలోను, చెరలోను కష్టాలననుభవించి, ఇగుప్తు ప్రధాని అయ్యే వరకు 13సం॥లు ఓపిక పట్టగా లేనిది మీరును విడిపింపబడు వరకు ముందుకు కొనసాగగలరు ’’ అని బిగ్గరగా చెప్పుచున్నాడు. మరియు అనేక మంది ఇలాంటివారున్నారు. పరుగు పందెము ముగించిన ఈ భక్తుల ధైర్యపరచు మాటలు మన ఆత్మీయ చెవులు తెరిచి విందుము. అంతము వరకు పట్టుదల కలిగియుందము. 

ప్రార్ధన: ప్రియప్రభువా, ఎన్నో ఆటంకాలు హింసలు ఉన్నను తమ పరుగును ముగించిన గొప్ప సాక్షి సమూహము మేషము వలె నన్నావరించియుండునని చదివి నేనెంతగానో ధైర్యపరచబడితిని. నేను కూడ సహనముతో అంతము వరకు పరుగెత్తు కృపననుగ్రహించమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page