top of page

21 ఆగప్పు 2025 గురువారము || వాగ్ధాన చేశమును స్వతంత్రించుకానుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 21
  • 1 min read

తేనెధారలు చదువుము : ద్వితియో 1:19-33



“... మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే” - ద్వితియో 20:4


విస్తారమైన, ఘోరమైన అరణ్య ప్రయాణము చేసిన పిదప ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములోని కొండ ప్రాంతమైన కాదేషు బర్నెయాకు చేరుకొనిరి. ఈ దేశమునే వారికి స్వాస్ట్థ్రముగా ఇచ్చెదనని దేవుడు వాగ్ధానము చేసియుందెను. విజయవంతంగా దానిని స్వాధీనము చేసికొనుటకు బదులుగా ఆ పదిమంది వేగుచూచి వచ్చిన వారి తప్పుడు సమాచారమును నమ్మిరి. దీనిని చూచిన యెహోషువ, కాలేబులు - “మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము... అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు” (సంఖ్యా కాం. 14:7-9) అని వారికి చెప్పిరి. వారు చెప్పిన దైవికమైన ఆలోచనకు ఇశ్రాయేలీయులు చెవియొగ్గక పోయిరి. కానీ అక్కడి జనులు “బలవంతులు”, “ఎత్తైనవారు”, వారి పట్టణాలు “చాలా పెద్దవి మరియు వారి ('ద్రాకారాలు “ఆకాశమునంటునట్లున్నవి” అని చూచిరి. అప్పుడు మోషే సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని గూర్చి, ఫరో నుండి వారినెలా విడిపించెనో, ఎర్ర సముద్రములో వారిని దేవుడెలా దాటించెనో, ఒక తండ్రి వలె ఎలా వారిని మోసికొని వచ్చెనో, అద్భుత రీతిలో అగ్నిస్తంభముగాను, మేఘస్తంభముగాను ఉండి ఎలా నడిపించెనో వారికి జ్ఞాపకము చేసెను. చివరకు ఆ తరమువారు వాగ్భానభూమిలో ప్రవేశింపలేకపోయిరి.


ప్రియ మిత్రులారా, క్లిష్ట పరిస్థితులలో దేవుని వాగ్ధానాలను సందేహించి ఆయనపై తిరుగుబాటు చేయక ఉందము. గతములో కఠిన పరిస్థితులలోను, బలమైన జనులకు విరోధంగాను దేవుడు అద్భుత రీతిగా ఎలా మనలను నడిపించెనో జ్ఞాపకము చేసికొందము. మన జీవితయాత్రలో ఆయన మనలను ఎత్తుకొని మోసి ఇంతవరకు తీసికొని వచ్చెను. గనుక ధైర్యము తెచ్చుకొందము. “దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు?” (రోమా 8:31) మన పక్షాన ఆయనే పోరాడి మన యుద్దాలు మనకొరకు గెలుచును. కావున ధైర్యముతో ముందుకు సాగి దేశమును స్వాధీనము చేసికొందము.

ప్రార్ధన :- పరమ తండ్రీ సమస్య తీవ్రతను చూచిన ఇశ్రాయేలీయుల వలె నేనుండకుండ, తిరుగుబాటుతనము, అయిష్టతను నానుండి తొలగించుము. నా పక్షాన నీవే పోరాడుచు జయమునిచ్చుదువని నమ్మిక నాకు దయచేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page