top of page

21, అక్టోబర్ 2024 చదువుము : 2 కొరింథీ 3:1-6

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 21, 2024
  • 2 min read

తేనెధారలు

పేదరికములో దాతృత్వము

‘‘వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను’’ (2 కొరింథీ 8:2)


మాసిదోనియాలోని సంఘములకు దేవుడనుగ్రహించిన కృపను గూర్చి మనమిక్కడ చదువుదుము. ఈ దిన వాక్యభాగములో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అపరిమితమైన రెండు విషయాలను మనము చూడగలము మొదటిగా, వారెంతో బీదవారైనను బహు దాతృత్వముతో ఇచ్చిరి. రెండవది, బహు శ్రమలలో ఉన్నను అత్యధికముగా సంతోషించిరి. కొరింథీ సంఘము బలపరచుటకు పౌలు వ్రాసిన ఈ విషయము నిజముగా జరిగినది. అసాధ్యమైన పరిస్థితులలో శక్తికి మించి ఇచ్చుటయా ? అవును, దేవుని కృప వలన మాత్రమే ఎవరైనా అలా చేయగలరు అని మనమెరుగుదుము. ఎనిమిది మంది చిన్న పిల్లలతోను, భర్తను కోల్పోయిన ఒక తల్లి ఒక చిన్న పట్టణంలో పేదరికముతో నివసించుచుండెను. ఒకసారి క్రిస్మస్ పండుగ కాలములో వారి పాస్టరుగారు సంఘముతో ` ఒక పేద కుటుంబము కొరకు ధారాళముగా ఇయ్యుడని చెప్పెను. ఇది వినిన ఆ తల్లి పిల్లలు మరింత ఎక్కువగా కష్టపడి అధికంగా పనిచేయుచు, ఒక పూజ భోజనము మానివేసి రూ. 200లు కూడబెట్టిరి. ఆ తరువాత ఆదివారము ఆ ధనమును కానుకగా ఎవరికి తెలియకుండా వేసిరి. పాస్టరుగారు తమ యింటికి వచ్చి వసూలైన ఆ డబ్బును వారికి ఇచ్చినప్పుడు వారిని పేద కుటుంబమని గుర్తించిరని తెలిసి ఎంతో బాధపడిరి. 210 రూపాయలు మాత్రమే వారు పొందిరి. కేవలం 10 రూ. మాత్రమే అధికంగా వచ్చినది. అదెంత ! వారిచ్చిన దానికంటే ఆ 10 రూ.లే ఎక్కువగా వసూలైనవి. ఆ మరుసటి ఆదివారము క్రీస్తు కొరకు ప్రయాసపడుచున్న పేద మిషనరీల కొరకు ఇయ్యమని ప్రకటించగా ఈ కుటుంబము ఏ మాత్రము వెనుకాడక వారు పొందిన ఆ రెండంతల పది రూపాయలు మొత్తమును ఇచ్చివేసిరి. అప్పుడు వసూలైన మొత్తం రూ. 250 మాత్రమే అని ఎరిగి ఎంతగానో ఆనందించిరి. దానిలో వారి భాగమే ఎక్కువగా ఉండెను. ఇదెంత విపరీతము ! ధనవంతులు అతి తక్కువగాను, ఈ పేద కుటుంబము మాత్రము, అందరికంటె అత్యధికముగా ఇచ్చిరి.


ప్రియ స్నేహితులారా, త్యాగపూరితముగా ఇచ్చుచున్నను సంతోషంగా ఇచ్చు అట్టి కృప కొరకు దేవుని వేడుకొందము. మనకొరకు యేసుప్రభువు మనకొరకు ఏమి ఇచ్చెనో జ్ఞాపకము చేసికొనుడి. ‘‘ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను’’ (వ. 9)

ప్రార్థన :` శ్రీమంతుడవైన దేవా, నాకున్నదంతయు నీవిచ్చినదే కానీ ఇతరులకు సంఘ పరిచర్యలలోను ఇయ్యవలసి వచ్చినప్పుడు నా చేతులు ముడుచుకొంటిని. గనుక ఇప్పుడు ధారాళంగాను, ఇయ్యగలిగిన దానికంటేను మరి ఎక్కువగా ఇచ్చునట్లు నా మనసు మార్చుకొనుటకు సహాయము చేయుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ, ఆమెన్.

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page