top of page

20, సెప్టెంబరు 2025 శనివారము || ప్రభువు నందు ధైర్యము తెచ్చుకొనుడి

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 20
  • 1 min read

తేనెధారలు చదువుము : న్యాయాధి 20:1-46


‘‘వారు... (పౌలు, బర్నబా) తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని హెచ్చరించిరి’’ - అపో. కార్య 14:21`22


‘‘ఓదార్చి, ఆదరించి బలపరుచు సామర్ధ్యము గల అద్భుతమైన శక్తివంతమైన పనియే ధైర్యపరుచుట. అది శుద్ధమైన తాజా గాలి లేక ఊపిరి పీల్చుకొనినట్లుండును, ఎవరును ఇది లేకుండ ఎక్కవ కాలం బ్రతకలేరు,’’ అని మైఖేల్ ఎమీగో గారు వ్రాసిరి. నిరుత్సాహము మన జీవితంలో ఆనందాన్ని విశ్వాసాన్ని దోచుకొనును. ప్రపంచంలోనే ఒక గొప్ప బైబిలు వ్యాఖ్యాతjైున విలియం బార్లే చెప్పినదేమనగా ‘‘మానవ బాధ్యతలో ఒక మహోన్నతమైన బాధ్యత ఏమనగా, ఇతరులను ధైర్యపరుచుట, లేక ప్రోత్సాహపరుచుట... ఒక మనిషి ఆశయాలను చూచి నువ్వుకొనుట, వారి ఉత్సాహముపై నీళ్ళు చల్లుట, వారిని అధైర్య పరచుటయు సుళువే. క్రైస్తవులమైన మనకు ఒకరునొకరు దైర్యపరచుకొనుట అను బాధ్యత ఉన్నది’’ బెన్యామినీయులు చేసిన హేయమైన కార్యాన్ని బట్టి వారికి, మిగిలిన 11 మంది ఇశ్రాయేలు గోత్రాలమధ్య జరిగిన యుద్ధమును గూర్చి న్యాయాధి. 20వ అధ్యాయంలో మనము చదువుము. అన్యాయం జరిగిన స్త్రీ భర్త అమె చనిపోయి ఉండుట చూచి అమెను పండ్రెండు ముక్కలుగా చేసి వాటిని ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు పంపెను. ఆ విధంగా బెన్యాయామీయుల అసహ్యకరమైన, అవమానకరమైన క్రియ వెల్లడి చేయబడెను. ఇట్టి దుష్కార్యమును వినిన మిగిలిన ఇశ్రాయేలీయులందరు కలసి ఒకే వ్యక్తిగా కలసికట్టుగా బెన్యాయామీలీయులతో పోరాడి ఘోర పరాజయమును చవిచూచిరి. ‘‘అయితే యుద్ధములో మొదటి దికాన ఎక్కడ నిలిచియుండిరో అక్కడనే తిరిగి ఇశ్రాయేలీయులు ఒకరినొకరు ధైర్యపరచుకొని తిరిగి యుద్ధము చేయబూనుకొనిరని’’ న్యాయాధి 20:22 చెప్పుచున్నది. కొంచెము ప్రోత్సాహము ఓడిపోయిన సైన్యమును బలపరచి ఎక్కడైతే ఓడిపోయిరో అదే ప్రదేశంలో కూడి పోరాడి జయమొందునట్లు ఎలా చేయగలిగెనో చూడగా ఎంతో ఆసక్తి కలిగించుచున్నదో కదా ! ఓటమియే అంతముకాదని తెలిసికొనుట గొప్ప విషయము కదా !


 ప్రియ మిత్రులారా, మీ శత్రువును చూచి వాడెంతో శక్తిమంతుడను తలంచి అధైర్య పడకుడి. ప్రభువు నందు మిమ్మును ధృఢపరచుకొనుడి. ఓటమి బుగ్గి నుండి లేచి తిరిగి పోరాడుము. తప్పక గెలుచుదువు ! ఆమెన్.

ప్రార్ధన:  పరమ తండ్రి, అలసిన నా ప్రాణాన్ని ఈ దినము ధృడపరిచినందుకు వందనాలు. శత్రువు చేతిలో ఓడినప్పుడు వెనుదీయక తిరిగి పోరాడుము. నీవే నా పక్షాన నాయకునిగా ఉండగా శతృవుపై నేను ఖచ్చితంగా జయమొందుదును, అని యేసునామమున కృతజ్ఞతలు తండ్రి, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page