20, ఆగప్పు 2025 బుధవారము || ఇెవులు భలలవాడు వినును గాక!
- Honey Drops for Every Soul

- Aug 20
- 1 min read
తేనెధారలు చదువుము : యషయా 46:3-13
“యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా నా మాటలు ఆలకించుడి...” - యెషయా 46:8
ఈ కాలములో లోకమందున్న ప్రజల మధ్య అత్యంత ప్రాముఖ్యమైనదైనను ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుచున్న విషయాలలో విను బుద్ధిని పెంపొందించుకొనుట ఒకటైయున్నది. మనము వినుటకు తక్కువగా ఇష్టపడువారమైయుండి మాట్లాడుటకు వేగిరపడువారమై యున్నాము. చక్కగా వినువారమైయుండవలెనని దేవుడు మనకు వినుటకు అద్భుతమైన రెండు చెవులు ఇచ్చియున్నాడు. పక్షుల గానాలు, జంతువుల అరుపులు మరియు సంగీతమును మనము వినవలెనని దేవుడు కోరుచున్నాడు. అన్నిటిని మించి ఆయన స్వరము మరియు ఇతరులు చెప్పునది కూడా ఆలకించవలెనని ఆయన కోరుచున్నాడు. మన దేవుడు మాట్లాడు దేవుడు. అన్యుల విగ్రహాలవలె కాక జీవము గల మన దేవుడు మాట్లాడుచుండెను, ఇప్పటికిని మాట్లాడుచున్నాడు. అబ్రాహాముతోను ఆది. కాం. 22:1 లేక బాలుడైన సమూయేలుతోను (1 సమూ 3:4,6,8, 10) లేక దమస్కు మార్గంలో తార్సువాడైన సౌలుతోను (అపో.కార్య 9:3-7) మాట్లాడినట్లు మనకు వినబడు స్వరముతో ప్రత్యక్షంగా మనతో ఆయన మాట్లాడకపోవచ్చును. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడు ప్రధానమైన మార్దమేమంటే లేఖనాల ద్వారానే. పరిశుద్దాత్మ చేయు ప్రత్యేకమైన పనులలో ఒకటి దేవని వాక్యమును “సజీవమైన బలము గలదిొగా చేయుట. (హెట్రీ 4:12). గనుక దేవుని వాక్యమును చదివి, ధ్యానించుచున్నప్పుడు పరిశుద్దాత్మ మన హృదయాలను తెరచి మన జీవితాలలో దేవుని చిత్తమును వెల్లడి చేయును. దేవునికిని మనకు మధ్య సహవాసము లేకపోవుటకు కారణము దేవుడు మృతుడు కాడు లేక మౌనంగా ఉండువాడు కాదు కానీ మనము ఆలకింపక పోవుట చేతనే.
ప్రియ మిటత్రులారా, మనలను మనము మన జీవితంలో ఏదైన ఆత్మీయ స్తబ్ధత ఉన్నదేమో పరిశీలించుకొందము. అనగా దేవుని స్వరము ఆలకించుట మానివేసితిమని అర్థము. ఒకవేళ మనకు బైబిలు చదివి, ప్రార్ధించుటకు ఏకాంత సమయము గడుపుట లేదేమో, లేక మనమాలాగు చేయుచున్నను అది నిజముగా కాక అలవాటు ప్రకారము చేయుచున్నామేమో. “సీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తము ప్రభువా మాట్లాడుము” అని బాలుడైన సమూయేలు చెప్పిన విధముగా మనమును అట్టి వైఖరి కలిగియుందము. దవుడు చెప్పునదేదో మనమాలకించుదము.ప్రార్దన :- ప్రియ ప్రభువా, ఎంతో అద్దుతమైన రెండు చెవులను, వినగల శక్తిని నాకనుగ్రహించితివి కానీ, నీవు చెప్పవలెననుకొనిన దానికినేను చెవియొగ్గక పోవుట ఎంతో విచారకరము. దేవుని వాక్యము చెప్పచుండగా పరిశుద్ధాత్మా, నా హృదయమును, నా చెవులను తెరచి వాక్యమేమి చెప్పచున్నదో నేనాలకించుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments