top of page

19, సెప్టెంబరు 2025 శుక్రవారము || క్రీస్తుకొరకు హింసింపబడితివా ? ఆనందించుము ! బహుమానము రాబోవుచున్నది !

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 19
  • 1 min read

తేనెధారలు చదువుము : అపో. కార్య 8:1-8


‘‘ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను’’. - అపో.కార్య 8:8


ఆహారము పంచిపెట్టుటకు బల్లలయొద్ద పరిచర్య చేయుటకు ఏర్పాటు చేయబడి అభిషేకింపబడిన శిష్యులలో ఒకరైన ఫిలిప్పు సమరయులకు వెళ్ళి సమరయులకు దేవుని రాజ్యమును గూర్చి బోధించి, క్రీస్తు నామము ఆ రాజ్యానికి రాజు, ఆ యేసునామము అన్ని నామములకు పై నామమని తెలియజేసెను. (అపో.కార్యా 8:12) ఆయన చేసిన అద్భుతాలు సమరయులు చూచిరి. ఆయన మాట్లాడిన మాటలు వినిరి, మరియు ఆ మాటల ద్వారా కలిగిన అద్భుత ఫలితాలను కూడా వారు వెంటనే చూచిరి. అతడు చెప్పిన మాటలు అలంకరించుటయే కాక జరిగినదంతయు మనుష్యుల వలన కలిగినది కాదు గానీ దేవునివలననే అని గ్రహించిరి. వారి పాత ఆచారాలన్నియు విడిచిపెట్టి ఆత్మతో, సత్యముతో దేవుని నారాధించు నిజమైన ఆరాధకులుగా మారిరి. (యోహాను 4:20`24) వారిక ఏమాత్రము ఆలస్యం చేయక, క్రీస్తునందలి వారి విశ్వాసమును బాహాటముగా ప్రకటించి వెంటనే బాప్తిస్మము పొందిరి. వారు క్రైస్తవ సంఘములో చేర్చబడి శిష్యుల చేత సహోదరులని ఎంచబడిరి. దీనివలన మిగుల సంతోషము కలిగెను. ప్రతి ఒక్కరు ఆనందించిరి, మరియు వారి పట్టణమునకు ఆశీర్వాదాలు కలిగెను. 


 ప్రియ మిత్రులారా, ఈ లోకములోని ఏ ప్రదేశముకైనను సువార్త తీసికొని పోబడినప్పుడు అది ఎంతో సంతోషకరము, గొప్ప ఆనందకరమైనది. క్రీస్తు సువార్త మనుష్యులకు విచారము కలిగించుదు గానీ, బదులుగా వారిని సంతోషముతో నింపును, అది సమస్త జనులకు శుభ వర్తమానముగా, సంతోషకరమైదిగా ఉండును. (లూకా 2:10) సమరయులు మాత్రమే ఆనందించలేదు కానీ సమరయు పట్టణమంతయు క్రీస్తును అంగీకరించుట చూచినప్పుడు ఫిలిప్పు కూడా బహుగా ఆనందించెను. క్రీస్తుకొరకు మీరు హింసింపబడుచున్నారా? ధైర్యము కోల్పోకుడి, గొప్ప ఆత్మల పంట మీరు చూడబోవుచున్నారు.

ప్రార్ధన:` పరమ తండ్రి, ఫిలిప్పు బోధ ద్వారా నీ వాక్యము ప్రకటింపబడినప్పుడు గొప్ప శక్తి బయల్పరచబడినదని నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. సువార్త కేవలము మాటలతోనే కాక పరిశుద్దాత్మ శక్తితో వచ్చును. ఆనందము ఆత్మల పంట చూచుటకు ఓపికతో కనిపెట్టయుండు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page