top of page

19, ఆగప్పు 2025 మంగళవారము || మన ప్రార్థనలెంత బలమైనవి!

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 19
  • 1 min read

తేనెధారలు చదువుము : దానియేలు 9:1-19



“ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్ధనను విజ్ఞాపనను చేయుచు...” - ఎఫెసీ 6:18


ఈ తీరిక లేని కాలంలో మనలో చాలామంది ప్రార్ధనలో దేవునితో సమయం గడుపుటకు పట్టించుకొనుట లేదు. కానీ ప్రార్ధించుటకు బదులు ఎక్కువగా దేవుని కొరకు పనిచేయుటకును, ప్రార్ధనా కూడికలకు హాజరగుటకును, టి.వి.లో భక్తి కార్యక్రమాలు చూచుటకు సమయమిచ్చుచుందుము. “మన ఆత్మృశక్తిని వినియోగించి తిరిగి దానిని నూతనపరచుకొని నింపుకొనుటకు మరచిపోదుము. మన కార్యక్రమాలను అధికం చేసికొని ప్రార్ధన సమయాన్ని తగ్గించి, ప్రార్ధించవలసిన సమయంలో పనిచేయుచుందుము. ఎందుకనగా ప్రార్ధించుట కంటే ఒక చురుకైన వముననుకు వనిచేయుటయే నులువుగా ఉండును. పరిశుద్దాత్మ చేత వాడబడువారు, వారు చేయు అధికమైన పనిని తగ్గించుకొనవలెను. తన సహచరులకు తోద్పడవలసిన సమయము దేవునికే ఇస్తున్నామన్నట్లున్నను దేవునితో ఏకాంతంగా గడుపుటకు అతడు తీర్మానించుకొనవలెను” అని బిషప్‌ జె.సి. రైల్‌గారు చెప్పిరి.

ప్రియ మిత్రులారా, ఇప్పుడు మనకు ప్రార్ధనా ఆత్మను అనుగ్రహించుమని దేవుని నడుగుటయే అత్యంత ప్రాముఖ్యమైన అవసరమైయున్నదని మనము గ్రహించుదము. ఈ పాపలోకంలో చనిపోవుచున్న జనులకు వారు రక్షింపబడవలసిన అవసరమును మనము చూచునట్లు మన మనోనేత్రములు తెరువుమని పరిశుద్ధాత్మను అడుగుదుము. (ప్రేమగల దేవుని దృష్టితో వారిని చూతము. అప్పుడు ఖచ్చితంగా బైబీిలునందలి ప్రవక్తలైన నెహెమ్యా, యెషయా,యిర్శ్మియా, దానియేలు మొవారు ప్రార్ధించునప్పుడు ఎందుకు ఏద్పిరో మనము అర్ధము చేసికొందము. బబులోను సామ్రాజ్యాన్ని వణికించి అందరు దేవుని నామమును మహిమపరచిన దానియేలు చేసినట్టి ప్రార్ధన మనమును చేయుటకు నేర్చుకొందము. తన జనులు పాదైన యెరూషలేమును తిరిగి కట్టుటకు పురికొల్పిన నెహెమ్యా చేసిన ప్రార్ధన వంటి ప్రార్ధన మనము నేర్చుకొందము. ప్రార్ధనలో ఉన్న శక్తిని మనము రుచి చూచుదము. మన అవసరము కొరకు మాత్రమె ప్రార్ధించి తృప్తిపడక నశించు ఈ లోకము కొరకు భారముతో ప్రార్ధించుదము.
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, నేనెంతో ప్రార్ధనా లేమి కలిగియున్నాను. ఎక్కువగా పనిచేయుటకు పూనుకొని, ప్రార్థనకు తక్కువగా సమయమిచ్చుచున్నాను. దయతో నన్నుక్షమించుము. ప్రార్ధనా వీరులైన దానియేలు, నెహెమ్యా మొగు అట్టివారి వలె ఉండవలెనని ఆశించుచున్నాను. గనుక ప్రార్ధన, విజ్ఞాపన ఆత్మను నాపై క్రుమ్మరించుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page