18, సెప్టెంబరు 2025 గురువారము || కేవలము నిరీక్షణ కలిగి వేచియుండును
- Honey Drops for Every Soul
- Sep 18
- 1 min read
తేనెధారలు చదువుము : యెషయా 49:13-16
"...భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదట చేసెదను.’’ - నిర్గ. కాం 34:10
తమకు వెట్టిపనులు చేయుచుండిన ఇశ్రాయులీయులు ఐగుప్తుని విడిచి వెళ్ళిరని ఫరో కోపావేశుడై శ్రేష్టమైన ఆరు వందల రధాలను, మరి ఇతర ఐగుప్తు రధాలను తీసికొని ఇశ్రాయేలీయులను వెంటాడెను. ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము మధ్య చిక్కుబడుట చూచిన ఇశ్రాయేలీయులు భయభ్రాంతులై కాపాడుమని దేవునికి మొఱ్ఱపెట్టిరి. అప్పుడు వారి కన్నుల ఎదుటనే ఒక అద్భుత కార్యము జరిగెను. ఏ ఆశ లేని స్ధితిలో మొఱ్ఱపెట్టుచున్న వేళలో లోకమందు ఎక్కడా, ఎన్నడు జరగనటువంటి ఒక అద్భుతమక్కడ జరిగినది. దేవుడు ఎఱ్ఱసముద్రము పాయలుగా చేయగా ఇరువైపుల
నీళ్ళు గోడలవలె నిలిచెను. ఆరిన నేలన నడిచినట్లు ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రము దాటి వెళ్ళిరి. బలమైన వారి శత్రువుల నుండి దేవుడు వారిని విడిపించెను. ఎప్పుడు చివరి క్షణాన ఇక ఇదే వారి జీవితములో అంతము అని వారనుకొనినప్పుడు వారి నిరీక్షణ అంతయు కోల్పోయినప్పుడు !
ప్రియ స్నేహితులారా, ఎన్నో బెదిరింపులు సమస్యలతో అన్నివైపుల చుట్టబడియున్న ఇశ్రాయేలీయుల వలె మీరుప్పుడు ఉన్నారా ? సమస్తము కోల్పోయి ఇక మీ జీవితం తిరిగి చిగురించే అవకాశమే లేదని మీరంటున్నారా? ఇప్పుడు ధైర్యము తెచ్చుకొనుడి. మీ జీవితము ప్రభువు స్వాధీనంలోనే ఉన్నది. ఎఱ్ఱసముద్రాన్ని విభజింజి ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళుటకు దారి కలుగచేసిన మీ జీవితములో మూయబడిన ద్వారము ఆద్భుతంగా తెరవలేడా? పుట్టు గ్రుడివాని కన్నులు తెరచిన కుష్టురోగి చర్మమును నూతనంగా జన్మించి శిశువు చర్మము వలె స్వస్థపరచినది ఆయన కాదా ? సంఘమును హింసించిన పౌలును మన పాపమార్గాలనుండి విడిపించి మారుమనస్సు కలుగచేసిన దేవుడు, తిరుగుబాటు చేయుచున్న మీ పిల్లలను ఆయన స్వరూపములోనికి మార్చి తన సేవకులగా చేసికొని వాడుకొనడా ? ఆయన మీ జీవితములో గొప్ప అద్భుతాలు చేయును. నిరీక్షణతో వేచియుండుము.
ప్రార్ధన:` ప్రియప్రభువా, ఇక ఏ ఆశ లేదని దాదాపు నేను చేతగాని స్ధితికి చేరుకొంటిని. అన్ని వైపుల నుండి నా శత్రువులు నన్ను బెదిరించుచున్నారు. కానీ ఇశ్రాయేలు దేవుడునెన్నడు విడువడని నేనిప్పుడు తెలిసికొంటిని. తగిన సమయమందు ఒక అద్భుతము చేసి సమస్త జనుల కన్నుల ఎదుట నన్ను ఖచ్చితముగా విడిపించుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments