18. ఆగష్టు 2025 సోమవారము || క్రీస్తు విరోధి ఎవరు?
- Honey Drops for Every Soul

- Aug 18
- 1 min read
తేనెధారలు చదువుము : 2 థెస్సలో 2:1-12
“వారి రాక... అబద్ద విషయమైన సమస్త... సాతాను కనపరచు బలముననుసరించియుండును” - 2 థెస్సలో 2:9
మన ప్రభువైన యేసు రెండవ రాకదకు ముందు జరుగు అంత్యకాల సంఘటనలలో “క్రీస్తు విరోధి పాలన ఒకటి. క్రీస్తు విరోధి ఒక శక్తియో లేక కొందరు కలసిన ఒక గుంపు కాదు, అదేదో అతీంద్రియ శక్తియో కాదు గానీ ఒక వ్యక్తియే, వాని క్రియల ద్వారా వాడు బయల్పడును. వాడు, నాశనము చేయబూనుకొనువాడు. ఏది దేవడనబడునో, ఏది పూజింపబదడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాదు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుందును. (2 థెస్సలో 2:3,4) మొదటిగా, క్రీస్తు విరోధి ఒక రాజకీయ నాయకుడదైయుండువారు క్రూర ముఖము గలవాడును, యుక్తిగలవాడునైయుండి ఉపాయము తెలిసికొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. (దానియేలు 8:28-25). రెండవదిగా, క్రీస్తు విరోధి కేవలము రాజకీయ అధికారమే కాదు గానీ మతసంబంధమైన అధికారము కూడా కలిగియుండును. వాడు దేవునిని, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించును (ప్రక 18:6). వాదు గొప్ప అద్భుతమైన సూచక క్రియలు చేయును, పరలోకము నుండి భూమి మీదకు అగ్నిని కూడా రప్పించును. మూడవదిగా, క్రీస్తు విరోధి ఒక సైన్వాధికారము గలవాడు. అతడు లోకమంతట ఉన్న రాజులను, వారి సైన్యమును పోగుచేసి వాని నాయకత్వము క్రింద హార్‌మెగిద్డోను అను లోయలో యుద్ధము చేయును. (ప్రకటన 16:14, 15) సంఘము ఎత్తబడిన తరువాతనే క్రీస్తు విరోధి బయలుపరచబడి రాజ్యమేలును. ప్రియ స్నేహితులారా, క్రీస్తుప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనమాయనతో కొనిపోబడునట్లు మనము పరిశుద్ధముగా జీవించుదము. లేనిచో మనము విడవబడుదుము, అప్పుడు చెప్పలేనంతగా (శమల ననుభవించవలసివచ్చును. మన మాటలోను, క్రియలోను, ఇతరులతో మన సంబంధాలలోను, మన జీవన విధానములోను పరిశుద్ధత కనబడునట్లు ఉందము. ప్రభువు ఏ ఘడియలో వచ్చునో మనకు తెలియదు గనుక ఆయన నెదుర్శొనుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉ ౦దము.
ప్రార్హన:- సర్వశక్తిగల దేవా, క్రీస్తు విరోధి యొక్కగుణ లక్షణాలను బైబిలు ఎంతో స్పష్టముగా వివరించుచున్నది. ఘోర శ్రమలనెదుర్కొనునట్లు నేను విడువబడకుండ, యేసుప్రభువు రెండవ రాకడలో ఆయనతో కూడా కొనిపోబడునట్లు పరిశుద్ధముగా జీవించు కృపనిమ్మని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments