17, సెప్టెంబరు 2025 బుధవారము || దేవదారు వృక్షము వలె ఎదుగుము
- Honey Drops for Every Soul

- Sep 17
- 1 min read
తేనెధారలు చదువుము : హోషీయ 14:5,6
"నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వువేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు’’. - కీర్తన 92:12
నీతిమంతుల ఆత్మీయ ఎదుగుదలను బైబిలు లెబానోను మీది దేవదారు వృక్షముతో పోల్చుచున్నది. దేవదారు వృక్షములు ఎన్నో విశిష్ట లక్షణాలు కలిగియుండును. మొదటిది, అవి 150 అడుగుల ఎత్తుకు ఎదుగును. సరాసరిన వాటి వెడల్పు 30 అడుగులు వాటి కొమ్మలు విశాలంగా వ్యాపించి దాదాపు 5వేల మంది దాని నీడను కూర్చోవచ్చని అంచనా. రెండవదిగా, ఈ దేవదారు వృక్షము మంచి సువాసన వెదజల్లును. వాటి కొమ్మలు కదిలి ఒకదానికొకటి రాసుకొనునప్పుడు మంచి పరిమళము వెదజల్లబడి మనసుకు హాయినిచ్చును. మూడవదిగా పాతనిబంధన కాలములో దేవదారు కర్రను శుద్దీకరణ కొరకు ఉపయోగించే వారు. లేవీ కాం. 14:4లో అంటు వ్యాధిjైున కుష్టురోగముతో ఉన్నవారి స్వస్ధత కొరకు యాజకుని వద్దకు రెండు సజీవమైన పవిత్రపక్షులను, దేవదారు కర్రను ఎఱ్ఱను నూలును, హిస్సోవును తీసికొని వెళ్ళవలెను. దేవదారు కర్రకు క్రిములను చంపు శక్తి ఉండునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. కాబట్టి ఆరంభ దినాలలో వారు దానిని క్రిమిసంహారకముగా వాడి వ్యాధి వ్యాపించకుండా వాడేవారు. నాల్గవదిగా, ఏ వస్తువైన పాడవకుండ నిల్వచేయుటకు దేవదారు నూనెను వాడుచూ ఉండేవారు. ఈ భూమి మీద ఉన్న దేవదారు వృక్షములన్నింటిలో లెబానోను మీది దేవదారు వృక్షములకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఎందుకనగా వాటిని యెహోవా నాటిన (దేవుడు) వృక్షములని వ్రాయబడియున్నది. (కీర్తన 14:16) దేవుని వృక్షములు.
ప్రియమిత్రులారా, లెబానోను మీది దేవదారు వృక్షము వలె మనమును మన చుట్టు ఉన్నవారికి క్రీస్తు ప్రేమ పరిమళమును వ్యాపింప చేయుదుము. వేదనలో ఉన్న అనేకులకు ఆశ్రయముగా ఉండి వారికి యేసును పరిచయము చేయుదుము. వేదనలోను, విడువబడిన స్ధితిలో ఉన్నవారికిని మన మాటలు కృపగలవిగా ఉండి అనేకుల గాయాలు మాన్పునట్లు చేయుదుము. నశించిన ఆత్మలు, వారి పాపాలు, సమస్త అతిక్రమములు యేసురక్తము చేత పవిత్రపరచబడునట్లు వారిని క్రీస్తు కల్వరి నిలువ చెంతకు నడిపించుదుము.ప్రార్ధన: సర్వశక్తి గల దేవా, దేవదారు వృక్షము గురించి తెలిసికొని నేనెంతో ఆశ్చర్యపడితిని. నేను కూడ ఇతరులకు నీ ప్రేమ పరిమళమును వ్యాపింపచేసి, శ్రమనొందుచున్న జనుల గాయాలు నా మాటలు క్రియల ద్వారా కట్టడి స్వస్ధపరచబడు కృపనిమ్ము. నీ మహిమను కనబరుచునట్లు నేను నీవు నాటబడిన మొక్క వలె ఉండి అందరిని కల్వరిని నడిపించు భాగ్యమిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments