top of page

17, ఆగష్టు 2025 ఆదివారము || శాపాలను దేవుడు దీవెనలుగా మార్చును

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 17
  • 1 min read

తేనెధారలు చదువుము : సంఖ్యా కాం. 22:1-12



“ఇదిగో... ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను” - సంఖ్యా. కాం. 28:20


కైస్త్రవులలో సాతాను పట్ల రెండు విధాలైన భావాలున్నవి. కొందరు సాతాను అనెవాడే లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ పూర్తిగా పట్టించుకోరు. మరికొందరైతే వాడంటే భయపడుచు వాడికి తగని వ్రాధాన్యత ఇచ్చుచుందురు. సాతాను అనువాడు ఉన్నది నిజము, వాడు సృష్టింపబడినవాడై, తిరుగుబాటు చేసిన దూత, తద్వారా దేవుని సన్నిధి నుండి పదద్రోయబడినవాడు. దయ్యాలనబడు దురాత్మల రాజ్యమును వాడు పరివాలించుచున్నాడు. సాతాను అను పేరుకు “శత్రువు” లేక “పీడించువాడు అని అర్ధము. ప్రక 12:9లో “మహా ఘటసర్పము” అనియు ఆది సర్పము అనబడు అపవాది సాతాను ఈ లోకమంతటిని తప్పుదారి పట్టించుచున్నాడని వాడు వర్ణించబదెను. సాతాను నిజముగా ఉన్నాడని, వాడికి శక్తి ఉన్నదని అనుటకు ప్రభువే కాదని చెప్పలేదు. కానీ, సాతాను మీద మనకు అధికారమిచ్చితినని, వాడి దాడుల నుండి కాపాడుదునని యేసుప్రభువు మనలను ధైర్యపరచెను. లూకా 10:19లో ఆయన 70 మంది శిష్యులను తనకు ముందుగా సిద్ధపరచునట్లు బయటకు పంపినప్పుడు “పాములను, తేళ్ళను త్రొక్కుటకును నాతాను బలమంతటి మీదను నేను మీకు అధికారమిచ్చియున్నాను, ఏదియు ఎంత మాత్రము మీకు కలుగజేయదు” అని యేసుప్రభువు చెప్పియున్నాడు.


దేవుని ప్రజలకు హాని చేయుటకు సాతాను అనేక విధాల ప్రయత్నించును - వాటిలో ఒకటి శపించుట. మోయాబు సరిహద్దులో ఇశ్రాయేలీయులు దిగియుండుట బాలాకు చూచినప్పుడు అతనిపై దాడి జరుగునని ఎరిగియుండియు ధైర్యంగా వారి నెదుర్శొనలేకపోయెను. కాబట్టి బిలామును కొని ఇశ్రాయేలును శపించుమని, తద్వారా వారు బలహీనపడితే వారిని సులువుగా ఓడించగలననుకొనెను. అయితే చివరకు ఏమైనది? దేవుడే అద్భుతరీతిగా జోక్యము చేసికొని బిలాము పలకాల్సిన శాపాలను దీవెనలుగా మార్చివేసెను.


ప్రియ మిత్రులారా, సాతానుకు గానీ, వాడు మనకు విరోధముగా ప్రయోగించు ఆయుధాలకు గానీ, మనము భయపడరాదు. మనమెల్లప్తుడు సర్వశక్తుడైన దేవుని కాపుదలలో ఉన్నామని గుర్తుపెట్టుకొందము.
ప్రార్ధన :- పరమ తండ్రీ సాతాను నిజమైనవాడు కాదను మోసములో నేను పడకుండా కాపాడుము. వానికున్న శక్తిని బట్టి భయపడక వాదిని త్రొక్కివేయుటకు నీవు నాకు అధికారమిచ్చితివనియు, వాడి చెడ్డదాడుల నుంది నీవు నన్ను కాపాడుదువను నిశ్చయత, ధైర్యముతో ఉండు కృపననుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page