16, సెప్టెంబరు 2025 మంగళవారము || ఆయన ఎన్నడు కునకడు నిద్రపోడు
- Honey Drops for Every Soul
- Sep 16
- 1 min read
తేనెధారలు చదువుము : మార్కు 4:35-41
‘‘బోధకుడా... నీకు చింతలేదా ’’ - మార్కు 4:38
కొన్నిసార్లు మనకు మించిన సమస్యలెదురైనప్పుడు మనము దేవుని సన్నిధిని అనుభవించలేకపోదుము, శిష్యులు తుపానులో చిక్కుబడినప్పుడు వారికి అదే జరిగినది. సృష్టికర్తjైున దేవుడే వారి నావలో వారితో ఉండినని వారు మరచిరి. కాబట్టి వారు ‘‘నీకు చింతలేదా... ? అని అవిశ్వాసముతో మాట్లాడిరి.
ప్రియ స్నేహితులారా, మన ప్రతి కదలికను, ప్రతి భావోద్రేకమును, మన ఆలోచనలను, మన పాపాలను, మరియు మన వైఫల్యాలను కూడా మన ప్రభువు చూచుచుండును. క్లుప్తంగా చెప్పాలంటే ఆయనకు సమస్తము తెలుసును. మనము దు:ఖములో ఉన్నప్పుడు ఆయన మనలనాదరించును. మనము తొలిగిపోయినప్పుడు సరిదిద్దును. పదే పదే అవిధేయులjైుతే శిక్షించును. దేవునికి అవిధేయులైన పిదప తమ్మును తాము చెట్లచాటున దాచుకొని, దేవుని మోసపుచ్చగలమని తలంచిన, ఆదాము, హవ్వలు ఎంత బుద్ధిహీనులు కాని దేవుడు సమస్తము చూచియుండెను. ‘‘ఆదామా? నీవెక్కడ’’ ‘‘నేను తినవద్దని నీకాజ్ఞాపించిన చెట్టు పండును నీవు తింటివా?’’ అని ఆయన ఆదామునడిగెను. మరియు వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని శిక్షించెను. దేవుని చేత బలంగా వాడబడిన ప్రవక్తjైున ఏలియా ఒక స్త్రీ jైున యెజెబెలుకు భయపడెను. ప్రాణము కాపాడుకొనుటకు అతడు పారిపోయి ఒక గుహలో దాగుకొనెను. అతడు కృంగిపోయి, ఆందోళనతో, విడనాడనడినట్లు భావించెను. దేవుడతనిని చూచెను ‘‘నీవిక్కడ ఏమి చేస్తున్నావు ఏలీయా?’’ అని దేవుడు అతనిని పేరుపెట్టి పిలిచి అడిగెను. (1 రాజులు 19:13) దేవుడతని గూర్చి శ్రద్ద కలిగి తప్పించుటకు సాయము చేసెను. హాగరు తన యజమానురాలైన శారయి చేత తరిమివేయబడి ఎడారిలో తిరుగులాడుచుండెను. ఆమె ఒంటరితనముతోను, నిస్సహాయ స్ధితితోను, ఎంతో వేదనతోను ఉండెను. దేవుడామెను చూచెను. ఆయన ఆమెను ‘‘హాగరూ ... నీవెక్కడనుంచి వచ్చితివి, ఎక్కడకు వెళ్ళుచున్నావు ?’’ అని అడిగెను. (ఆది కాం. 16:8) ఆయన ఆమెను ఆదరించి దీవించెను గనుక ఎన్నడు కునుకక, నిద్రపోక, ప్రతి నిమిషము మనలను చూచుచు, లక్ష్యముంచు దేవుడు మనకున్నాడని ధైర్యము కలిగి యుందుము.
ప్రార్ధన:` ప్రియప్రభువా, నేను కష్టములో ఉన్నప్పుడు ‘‘ప్రభువా, నీకు చింతలేదా?’’ అని అపనమ్మికతో కేకలు వేయక, నీవు నన్ను గూర్చి చింతించు దేవుడవని గ్రహింపు కలిగియుండ కృపనిమ్ము. ఆదరించు నీ సన్నిధి నేనభవించుదునుగాక. నీవు నన్ను హెచ్చరించునప్పుడు చెవియొగ్గి నన్ను నేను సరిచేసుకొనుటకు సహాయము చేయుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments