16, ఆగపు 2025 శనివారము || ఏలియా వలె ప్రార్ధించుము!
- Honey Drops for Every Soul

- Aug 16
- 2 min read
తేనెధారలు చదువుము : 1 రాజులు 18:41-46
“యెహోవా ! అబ్రహాము, ఇస్సాకు, ఇ(శాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు... ఈ దినము కనుపరచుము” - 1 రాజు 18:86
ఏలియా గొప్ప ప్రార్ధనాపరుడు. “అతడు ఆసక్తిగా ప్రార్ధించెను” అని యాకోబు 5:17 చెప్పుచున్నది. మరియు 18వ వచనము “మరల అతడు ప్రార్టించెను...” అని చెప్పుచున్నది. దేవుని ప్రవక్తలను యెజెబెలు చంపించి వారి బదులు బయలు దేవతా యాజకులను నియమించెను. ఇశ్రాయేలు దేశమును చీకటి కమ్మెను. ప్రతి దినము దేశము వి[గ్రహారాధనాచారాలతో అన్య దేవతాలయాలతో నిండిపోవుచుందడెను. దేవుని మహిమ ఆ దేశమును విడిచిపోయెను. బయలు బలిపీఠాల నుండి ధూపము వెల్తువెత్తెను. ఇట్టి క్రిష్ణ పరిసి జథతిలో దేశమంతా భక్తిలో దిగజారి దట్టమైన అంధకారము క్రింద ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తితో లేవనెత్తెను, ఒక బృందమును కాదు, ఒక దేవదూతను కాదు గానీ మనవంటి ఒక మనిషినే ! దేనికొరకు ? ప్రార్ధించుటకు ఏలియా ప్రార్ధించు వ్యక్తి. పాపము విషయమై దేవుని మనస్సుతో ప్రలాపించెను. అన్ని విధాల దేవునికి అతడు విధేయుడాయెను. “రీతు వాగు దగ్గర దాగియుండుమూ అని దేవుడు చెప్పినప్పుడు అతడా విధంగానే చేసెను. ఆ తరువాత “వెళ్ళీ ఆహాబు ఎదుట నిలువుముూ అని చెప్పినప్పుడు కూడా అలా చేసెను. 1 రాజులు 18:86,37లో కర్మెలు పర్వతము మీద ఏలియా చెసిన ప్రార్ధన సంక్షిప్తంగా వ్రాయబడిన ఉత్తమమైన ప్రార్ధన. అట్టి క్లుప్తమైన, శక్తివంతమైన, బహిరంగముగా చేయు ప్రార్థనలు రహస్యంగా చేసిన దీర్హ ప్రార్ధనా విజ్ఞాపనల నుండి వెలువడినవి అని ఇ. ఎమ్. బౌంద్స్‌గారు చక్కగా చెప్పిరి. అన్య ప్రవక్తల నాశనం కొరకో, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల నాశనం కొరకో ఏలియా ప్రార్ధించలేదు గానీ, దేవుని మహిమ, ఆయన మహాత్యము, శక్తి వెల్లడి చేయబడుటకే చేసెను.
(క్రియ స్నేహితులారా, మన ప్రార్ధన ఎంత శక్తిలేనిదిగా ఉన్నదో పరిశీలించుకొనవలదా! ఏమి చేయవలెనో, ఎలా చేయవలెనో అది దేవునికి మనమే చెప్పుదుము ! క్లుప్తంగా చెప్పాలంటే మనము ప్రార్ధన తప్పు అన్నీ చేస్తాము. అంధకారములో మునిగియున్న మన దేశములో గొప్పుఉ జ్జీవమును రగుల్చుటకు ఏలియాల కొరకు దేవుడు ఎెదకుచున్నాడు. ఆయన మనస్సెరిగి ఆయన కోరుచున్న విధముగా ప్రార్ధించువారిగా మనముందమాప్రార్దన :- పరమ తండ్రీ, నా దేశము సాతాను బంధకాలలోను, నా జనులు పూర్తి అంధకారములో ఉండగా వారికొరకు ప్రార్దించుటకు నాపై ప్రార్ధనా, విజ్ఞాపన ఆత్మను కుమ్మరించుము. మా దేశంలో నీవు ఉజ్జీవం పంపునట్లుగా నీ మాటకు విధేయుడైన ఏలియావలెనే నేను కూడా నీకు లోబడి నీ మనసెరిగి ప్రారించుటకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments