top of page

15, సెప్టెంబరు 2025 సోమవారము || మనము దేవుని సంతోషపరుచుచున్నామా ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 15
  • 1 min read

తేనెధారలు చదువుము : ఎఫెసీ 5:1-12


‘‘ప్రభువుకేది ప్రతికారమైనదో దానిని పరీక్షించుచు....’’ - ఎఫెసీ 5:10


పాత నిబంధనలో నోవహు తన జీవితంలో ప్రతి విషయములోను దేవునికి ప్రీతికరముగా జీవించెనని మనము చూచుదుము.మొదటిగా, ఆయన దేవునితో నడిచెను. (ఆది కాం.6:9) అతడు యదార్ధవర్తనుడు. అతడు నిందారహితముగా జీవించెను. తన కాలమందు అతడు కల్మషం లేకుండా జీవించెను. అతడు దేవుని చిత్తమందు, సత్యము, నీతిననుసరించి నడుచుకొనెను. అతడు మధురమైన దేవుని సహవాసమునను భరించెను. రెండవదిగా, నోవహ దేవునికి లోబడెను. (అది కాం 6:22) దేవుడతనికి చూపించిన మాదిరి ఓడ నిర్మించెను. దేవుడు చెప్పినట్లే అతడు తన కొరకు, తన కుటుంబము కొరకు మరియు ఆ ఒడిలోకి చేర్చిన సమస్త జీవులకును ఆహారము సమకూర్చుకొనెను. (అది కాం 7:4,5) వర్షము, వరదలు అంటే ఏమిటో ఎరగనప్పటికిని దేవుడు చెప్పిన దానిని నమ్మెను. తన చుట్టునున్నవారందరు అతనిని ఎగతాళి చేసి, అవమానించినను, నిందించినను దేవుడు తనకిచ్చిన దర్శనము నుండి అతడు తొలిగిపోలేదు. దేవుడు చెప్పినదేదైనను అది తప్పక జరుగునని నమ్మెను. నాల్గవది, నోవహు దేవుని ప్రేమించెను. (ఆది కాం. 8:20) వరద నీరు తగ్గిన తరువాత నోవహు తన కుటుంబముతో బయటకు వచ్చి మొట్టమోదట తనకు తన యింటివారికి ఇళ్ళు నిర్మించకొనలేదు కానీ దేవుని కొరకు బలిపీఠము కట్టెను ఇది అతని పట్ల గొప్ప ఉన్నత ప్రేమను చూపెను. అతని మొదటి మరియు గొప్ప శ్రద్ద దేవుని మహిమపరుచుటయందే కాపీ అశాశ్వతమైన లేక తాత్కాలికమైన మేలు కొరకు కాదు. ఐదవదిగా, నోవహు దేవుని స్తుతించెను. (ఆది కాం. 8:20) అతడ కట్టిన బలిపీఠము మీద నోవహు దేవునికి కృతజ్ఞాతార్పణగా కొన్ని పవిత్ర జంతువులను అర్పించెను. 


 ప్రియ మిత్రులారా, దేవునికేది ప్రీతికరమైనదో పరీక్షించి, మన జీవితాల ద్వారా నోవహు వలె దేవునికి ఘనపరుచుదుము. 

ప్రార్ధన: ప్రియప్రభువా, మేమీలోకంలో జీవించుచుండగా నిష్ఫలమైన అంధక్రియలలో పాల్గొనక నోవహు వలె నీతో నడుచు కృపననుగ్రహించుము. పరిస్ధితులు అనుకూలముగా లేనప్పటికిని నీకిష్టమైన ప్రేమగల జీవితము జీవించుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page