top of page

15, ఏప్రిల్‌ 2025 మంగళవారము || తన యిష్ట ప్రకారమే మనకై యేసు తన ప్రాణమర్పించుకొనెను

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Apr 15
  • 1 min read

తేనెధారలు చదువుము : లూకా 22:1-24



‘‘... గొఱ్ఱెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను... ఎవడును నా ప్రాణము తీసికొనడు, ... దాని పెట్టుటకు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు’’

- యోహాను 10:17,18


ప్రభువైన యేసు ఈ భూమిపై జీవించినప్పుడు సన్హెద్రీను సభ అనునది యూదుల న్యాయవ్యవస్థలో ఒక భాగమైయున్నదిజ కయప అను ప్రధాన యాజకునిచే నడిపింపబడు డెబ్బది ఒక్క మంది సభ్యులతో కూడినదై ఇశ్రాయేలులో ఒక మతసంబంధమైన అత్యున్నత వ్యవస్థjైు యుండెను. యేసు తన పరిచర్య నారంభించినపుడు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన అధికారముతో మాట్లాడిన తీరు, ఆ మత పెద్దలను కలవరపరచెను. వారు ఆత్మీయ అంధకారములో ఉండినందున యేసును మెస్సయ్యగా చూడలేకపోయిరి. మెస్సయ్య ఒక యుద్ధశూరుడనియు, వారి రాజ్యములో శాంతి నెలకొల్పునను వారిలో ముందుగా ఉండిన భావనల వలన దానినే వారు నమ్మిరి. ఆయన రోమీయులను ఓడిరచి వారికి నెమ్మదినిచ్చుననుకొనిరి. అయితే వారి తలంపుల ప్రకారము కాక ‘‘పాపులతోను’’ సుంకరులతో యేసు సహవాసము చేయుచుండెను. యూదులకు వాగ్ధానము చేయబడిన రాజును గూర్చిన వారి తలంపులకు ఆయన ఏ మాత్రము తగినట్లు లేకుండెను. కాబట్టి వారాయనను ద్వేషించి, చంపుటకు ఆలోచన కలిగియుండిరి. యేసు దేవదూషణ చేసెనని వారాయనపై క్రమేణ నిందవేసి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన మరణశిక్షకు పాత్రుడని చెప్పిరి. గనుక యేసు తనకు తానే యూదుల రాజని ప్రకటించుకొనెనని కయప చెప్పెను. రాజద్రోహముగా ఆయనపై దానిని ఆపాదించి రోమా ప్రభుత్వానికి విరోధముగా ప్రధానమైన నేరముగా భావించిరి. ఆ మతనాయకులు వారి అధికారము నుపయోగించి యేసు చేసినది క్షమించరాని పాప మరియు సిలువ మరణము నొందవలెనని తీర్మానించిరి.


ప్రియ మిత్రులారా, యూద మతనాయకులు, రోమీయులు ఆయనను సిలువ వేయుటకు ప్రేరేపింపబడినను, యేసు తన ఇష్టప్రకారమే మన పాప ప్రాయశ్చితార్థమైన తన ప్రాణమునర్పించెననునది వాస్తవము. (1 పేతురు 2:22-24) మన పాప విమోచన క్రయధనము చెల్లించుటకు మరణించిన ఏ దేవుడును లేడు. యేసు ఒక్కరే ప్రభువుల ప్రభువు, రాజుల రాజు, స్తోత్రార్హుడు, ఆరాధన, మహిమ, ఘనతలకు యోగ్యుడు.

ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నేను నిత్యజీవమును స్వాస్థ్యముగా పొందుటకు నీవే నీ ప్రాణమును సిలువపై నీ యిష్టానుసారముగానే అర్పించితివి. ఇంత గొప్ప త్యాగముకై కృతజ్ఞతలు. నా కొరకు ఉచితంగానే నీవనుగ్రహించిన ఈ రక్షణ వరమునకై నా బ్రతుకు దినములన్నియు నీకు కృతజ్ఞుడనై యుండి, నీ ప్రేమను అందరికి ప్రకటించుదునని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page