15, ఆగష్పు 2025 శుక్రవారము || దేవా. మాదేశ జనులను రక్షింపుము
- Honey Drops for Every Soul

- Aug 15
- 1 min read
తేనెధారలు చదువుము : నిర్గ.కాం. 16:1-3; సుంఖ్యా కాం. 11:4-6
“... ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును
- 2 కొరింధీ 3:17
ఈ రోజు మన దేశము 79వ స్వాతంత్ర్య దినోత్సవము జరుపుకొనుచున్నది. ప్రతి సం॥ ఈ దినాన మనమీ ప్రశ్న వేసికొనవలసియున్నది - “మనము స్వతంత్రులమా ? నిజమే కావచ్చు. పరాయి వాలన క్రింద హింసింపబడుచు దాసత్వము క్రింద ఉన్న మన దేశము భౌతికంగా విడిపింపబడినది. కానీ మన దేశ ప్రజలు ఆత్మీయ దాసత్వము నుండి విడిపింపబడిరా ? లేదు, ఇంకను విడిపింపబడలేదు. ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించినప్పుడు కట్టు బానిసత్వము, బాధల నుండి వారు విడిపింపబదిరి. కానీ వారు మానసికంగా విడిపింపబడలేదు. ఎజ్జ సంద్రము విడిపోయిన అద్భుత ఘటనను, దేవుని అత్యద్భుత శక్తిని చూచియు వారానందించుటకు బదులుగా మోషేకు విరోధంగా, “అక్కడ ఐగుప్తలో మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినుచుంటిమి... అయితే ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు మీరు మమ్మును అక్కడ నుంది తోడుకొని వచ్చితిరి” అని సణిగిరి. వారు బానిసత్వానికి అలవాటుపడి ఇంకను అదే మానసిక స్థితిలో ఉండిరి గనుక వారు దేవుడు అనుగ్రహించిన ఘనమైన విడుదలను ఆనందించలేకపోయిరి. ఎంత విచారకరము]
మన జనులు ఇంకను ఏ విధంగా బానిసత్వంలో ఉన్నారు ? మొదటిగా, వారు విగ్రహారాధనకు కట్టుబడియున్నారు. రందవదిగా, వారు మూఢధాచార నమ్మకాలతో ఉన్నారు. మూదవదిగా, వారు వ్యభిచారము, శ్రాగుబోతుతనము అను పాపాలకు బానిసలుగా ఉన్నారు. అట్టి బంధకాలనుండి విదిపించుటకు మన ప్రజలకు కైస్త్రవులమైన మనమెలా సహాయము చేయగలము. ప్రార్ధన | ఇప్పటి పరిస్థితికి ప్రార్ధన అవసరమై యున్నది ! మన దేశ ఉజ్జివం కొరకు మనము కన్నీటితో ప్రార్ధించవలెను. భయముతోను, మరియు త్వరపడి అత్యవసర ప్రార్ధన చేయకపోవుట చేతను, సువార్త చెప్పుటలో బాగా ధనాపేక్ష రాజ్యమేలుట చేతను, మన నిర్లక్ష్యము వలన ఉబ్బ్టీవము ఆలస్యమగుచున్నదని లియోనార్డ్ రావెన్‌హిల్ చెప్పిరి. కావున, మోకరించి మన కన్నీళ్ళు ఒలకబోసి హృదయవేదనతో మన దేశ ఉజ్జీవము కొరకు ప్రార్ధించుదము.
ప్రార్దన :- ప్రియప్రభువా, అనేక విధాలుగా ఆత్మీయంగా సాతాను బంధకాలలో ఉన్ననా దేశ జనుల కొరకు ఈ స్వాతంత్ర్య దినోత్సవము నాడు ప్రార్దించుచున్నాను. వారి నేత్రాలు తెరచి చీకటి నుండి వెలుగులోనికి తెచ్చి జీవము గల దేవుని నెరిగి నీ ప్రియ కుమారుడైన యేసును తమ రక్షకునిగా అంగీకరించు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments