top of page

15, అక్టోబరు 2024 మంగళవారము తేనెధారలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 15, 2024
  • 2 min read

చదువుము : నిర్గ.కాం. 4:1-14

మరెన్నడు నీ అసమర్థతను చెప్పవద్దు

‘‘అప్పుడు దేవుని కోపము మోషేకు విరోధముగా రేగెను...’’ (నిర్గ.కాం. 4:14)


దేవునికి తన పిల్లల్లో ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ప్రణాళికలున్నవి, కానీ వారి సహకారముతోనే ఆయన వాటిని చక్కగా నెరవేర్చును. మోషే పుట్టక మునుపే అతని పట్ల దేవునికి ఒక ఉద్దేశముండెను. అందుచేతనే హెబ్రీయుల పిల్లలందరిని నైలునదిలో పారవేయుమని ఫరో ఆజ్ఞాపించినప్పుడు దేవుడు మోషే ప్రాణాన్ని కాపాడెను. మోషే నాయకత్వములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించవలెననునదియే దేవుని ప్రణాళిక. గనుక తగిన సమయము వచ్చినప్పుడు మండుచున్న పొదయందు దేవుడు మోషేకు ప్రత్యక్షమై ‘‘నా జనులైన ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి బయటకు తెచ్చుటకు నిన్ను నేను ఫరో వద్దకు పంపుచున్నాను, వెళ్ళుము’’ అని చెప్పెను. అయితే మోషే ఏమన్నాడు ? ‘‘అనేకమైన కారణాలు చెప్పి దేవుని పిలుపును అతడు తిరస్కరించెను’’ అని మనము చదువుదుము. అంత గొప్ప పనికి అతడెంత తగినవాడను కానని చెప్పియుండెను. అది ఎంతో తగ్గించుకొనినట్లు మనకు అనిపించును కానీ అది దీనత్వము కాదు కానీ అది మోషేకు ఉన్న గర్వమే. మోషే చేతికర్రను పాముగా మార్చి, తన కుష్టము వచ్చిన చేతిని తిరిగి బాగుచేసి దేవుడు తన శక్తిని వెల్లడి చేసిన తరువాత కూడా మోషే దేవుడు చెప్పిన గొప్ప పని చేయుటకు లోబడకపోయెను. ఒకదాని తరువాత ఒకటిగా అడ్డుచెప్పుచుండగా దీనిని బట్టి దేవుని కోపము రగిలెను. దేవుని ఎంపికయే సరైనది కాదని దేవునికి ఋజువు చేయవలెనన్నట్లుగా అతడు ప్రవర్తించెను. అతడు తన అసమర్థతను మాత్రమే పెద్దగా చూపుచు దేవుని అనంత శక్తియందు నమ్మిక యుంచకపోయెను.


ప్రియ మిత్రులారా, వాస్తవానికి మోషే ఈ పనికి అసమర్థుడే. మనము కూడా అంతే. దేవుడు ఏ పనికి పిలుచునో దానికి మనమును చేతకానివారమే. మనలో అంత సమర్థత ఉంటే మనకు దేవుడు అవసరము లేదు. దేవునికి తెలివిలేనివారే, సమర్థత లేనివారే అవసరము. గనుక మనము సాకులు చెప్పక ఆయన ఏమి చెప్పినను, ఎక్కడకు పంపినను అక్కడికి వెళ్ళుటకు, చేయుటకు సిద్ధముగా ఉండుము. మనకెన్నో బలహీనతలుండవచ్చు కానీ మనమేమిటో దేవునికి తెలుసు అని గుర్తు పెట్టుకొందము. అయినను ఇంకను ఆయన కొరకు పనిచేయవలెనని ఆయన కోరుచున్నాడు. మన సృష్టికర్తjైున దేవుని కొరకు పనిచేయుట గొప్ప ధన్యత కాదా? ఆయన పిలుపును ఆనందముతో అంగీకరించుదము. మన బలహీనులము, అసమర్ధులమైనను ఆయన మనలను తన మహిమార్థము వాడుకొనును.

ప్రార్ధన :` నన్ను రూపించిన నా ప్రభువా, నీవే నా సృష్టికర్తపు. నాకున్న సమస్త సామర్ధ్యాలు, నిపుణతలు నీవే నాకనుగ్రహించితివి. నాకున్నవన్ని తిరిగి నీకే సమర్పించుకొనుచున్నాను. నీ పరిచర్యకొరకు వాడబడుటకునను నీ స్వాధీనంలోనికి తీసికొనుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్.

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page