top of page

14, నవంబర్‌ 2024 గురువారము || తేనెధారలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Nov 14, 2024
  • 2 min read

చదువుము : 1 సమూ 30:1-9, 17-20

తుపాను రేగునప్పుడు సంగీతము మ్రోగునుగాక!


‘‘నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను, నా పెదవులను... ఉత్సాహ ధ్వని చేయును’’ (కీర్తన 71:22,23)



జర్మనీకి చెందిన ఒక సంగీతకారుడు గాలితో పలుకు ఒక వీణను తయారుచేసి తన భవనంలో దాని తీగెలను బిగించి అది పలుకునప్పుడు ఎంతో ఆసక్తితో వినుచుండెను. అయితే వేసవిలో గాలి అంతగా వీచదు గనుక ఆ తీగెలు అంతగా కదిలింపబడవు గనుక వాటి శబ్దము వినిపించేది కాదు. కానీ వసంతకాలము వచ్చినప్పుడు వీచు మెల్లనైన గాలులు ఆ వీణను తాకినప్పుడు చక్కని పాట వినిపించేది. చివరకు చలికాలము బలమైన గాలులు వీచినప్పుడు ఆ భవనమంతయు దాని స్వరము మారుమ్రోగేది. ఇప్పుడు ఆ వీణ మంచి సంగీతాన్ని పలికించెను. చాలాకాలము నుండి పలకని ఆ వీణ బలమైన గాలులు వీచి, ఆ తీగెలను తాకినప్పుడు మధురమైన సంగీతము పలుకుచుండగా అతడు విని ఎంతో సంతోషించుచుండెను ! అలాగే ఇప్పుడు మానవాళి పొందు గొప్ప ఆనందమేమనగా వారి జీవితాలలో శ్రమనొందినప్పుడు కలుగు అనుభవాలే. ఒక జర్మనీ దేశపు కలిగోయితె చెప్పినదేమనగా ‘‘ఒక గీతముగా రూపొందని శ్రమ నేనెన్నడును అనుభవింపలేదు !’’ అని. మీరిప్పుడు శ్రమలో పయనించుచున్నారా ? దావీదు అక్కడ లేనప్పుడు అమాలేకీయులు వచ్చి సిక్లగుపై దాడిచేసి, పట్టణమును కాల్చివేసి, అతని స్త్రీలందరిని, పిల్లలను, వారు కలిగియున్న సమస్తమును దోచుకొని వెళ్ళినప్పుడు గొప్ప వేదనతో దావీదును, అతనితో ఉన్నవారును ఇక ఏడ్చుటకు శక్తిలేనంత బిగ్గరగా విలపించిరి (1 సమూ 30:4). అయితే అదే అంతము కాలేదు. తరువాత అతడు శత్రువులను వెంటాడి ప్రతి ఒక్కరిని చంపి, అతని శత్రువులైన అమాలేకీయులు నోచుకొని వెళ్ళిన సమస్తము స్వాధీనము చేసికొనెను. అతని జీవితంలో పదే పదే అట్టి గొప్ప శ్రమలననుభవించుటచేత ఇప్పుడు కూడా అట్టి శ్రమనొందుచున్న వారికి గొప్ప దీవెనకరముగా అతడెన్నో చక్కని, ప్రశస్తమైన కీర్తనలను వ్రాయగలిగెను.


ప్రియ మిత్రులారా, అంతయు బాగున్నప్పుడు  ఒక క్రైస్తవునిగా నవ్వుచు, సంతోషించుచున్నను ఈ లోకము మాత్రము ఆనందించదు. తుపాను వంటి పరిస్థితులలోను మీరు ఆనందంగా పాడుచున్నప్పుడు అది ఎంతో గొప్పగా ఉండును. దీనిని బట్టి మీరు దేవుని నామమును మహిమపరచి, అనేకులకు దీవెనకరముగా మారుదుము.
ప్రార్ధన :- పరమ తండ్రీ, నేను బాధాకరమైన పరిస్థితులలో పయనించుచునే నీకు నన్ను లోబరచుకొనుచున్నాను. నీ నామమును నా జీవితంలో మహిమపరచు ఇంపైన సంగీతముగా చేయునట్లు ఈ స్థితిలో నీవే నన్ను నడిపించుదువని నేనెరుగుదును. సమస్తము సంతోషముగా సహించునట్లు కృపచూపుమని సాటిలేని యేసునామమున ప్రార్దించుచున్నాను తండ్రి ఆమెన్‌.


Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page