14, ఆగష్రు2025 గురువారము || కైస్త్రవ గృహనిర్వాహకత్వము!
- Honey Drops for Every Soul

- Aug 14
- 2 min read
తేనెధారలు చదువుము : లూకా16:1-13
“గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కయొప్పగింపవలెను”
- రోమా 14:12
ఇతరుల ఆస్తిని నిర్వహించి చూచుకొనుటయే గృహ నిర్వాహకత్వము. దానిని అతడు సొంతము
చేసికొనలేడు కానీ దానితో తన యజమానికి లాభం తెచ్చిపెట్టుటకు వాడవచ్చు, దానిని యనుభవించుటకు కూడా అతనికి వీలు ఉందును. మన ప్రభువు, మన యజమాని దేవుడే, మనమాయన గృహ నిర్వాహకులము. ఎలా ? మొదటిది, మనకున్న ఈ లోకపరమైన సంపద అది కొంచెమైనను, ఎక్కువైనను దానికి మనము నిర్వాహకులము. దానిని మనమెలా సంపాదించామో, ఎలా ఖర్చుపెట్టామో ఒక దినాన మనము దేవునికి జవాబు చెప్పవలసియున్నది. మనకు కలిగియున్న దానిని బట్ట కృతజ్ఞతా హృదయం కలిగియుండి దేవుని చిత్తానుసారముగా దానిని వాడుటయె నిజమైన గృహ నిర్వాహకత్వము. దేవుడే యజమాని గనుక దానిని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఆయనకు ఇష్టము లేని పనులు చేయరాదు. రెండవదిగా, మన సమయము విషయంలో కూడా మనము గృహనిర్వాహకులమైయున్నాము. “దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని ఎఫెసీ 5:15, 16 చెప్పుచున్నది. సమయము అమూల్యమైనది గనుక మనం దాని విలువ తెలిసికొనవలెను. మనము దానిని వ్యర్థము చేయరాదు, నిర్లక్ష్యంగా వాడరాదు. కానీ, మనకును, దేవునికిని ప్రయోజనకరమైన రీతిలో మనము సమయమును మంచి పనులు చేయుటకు వాడవలెను. మూడవదిగా, దేవుడు మనకనుగ్రహించిన తలాంతులు, వరాలు, సామర్భాలకు మనము లెక్క అప్పచెప్పవలసిన గృహనిర్వాహకులమైయున్నాము. “దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొకక్కడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి” అని 1 పేతురు 4:10 చెప్పుచున్నది. “నెనమైయున్నదో అది నాది - దానిని నేను తీసికొందును” - స్వార్ధపరుదైన వ్యక్తి “నాది నాదే - నెను దానిని దాచుకొందును” అని చెప్పును. కైైస్తవుదైతే “నాకున్నది దేవుని నుండి కలిగిన బహుమానము. నేను దానిని ఇతరులతో పంచుకొందును అని చెప్పవలెను అని వారెన్ దబ్బు. వియర్స్‌బీగారు వ్రాసిరి. వాటన్నిటికంటె మనము సువార్తకు గృహ నిర్వాహకులమైయున్నాము. సువార్తను అప్పుగింంచుటకు మనము యోగ్యులమని దేవుని వలన ఎంచబడినవారము అని 1 థెస్స 2:4 చెప్పుచున్నది. మనకు అప్పగింపబడినదానిని కాపాడుటయే కాక దానిని ఇతరుల జీవితాలలో ప్రయోజనకరముగా ఉండునట్లు ఉపయోగించవలెను. మిత్రులారా, మనము దేవునికి నిజమైన, నమ్మకమైన గృహ నిర్వాహకులమేనా ?
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, నాకున్న ఆస్తి, సమయము, వరాలు, సామర్వ్యాలు మొనవన్నిటికీ నీవే యజమానివని, వాటన్నిటికి నేను కేవలము గృహనిర్వాహకులమేయని నాకు గుర్తు చేసినందుకు వందనాలు. నిన్ను నేను కలిసికొనినప్పడు మెప్ప, బహుమానము పొందునట్లు నిజమైన గృహనిర్వాహకునిగా ఉండునట్లు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments