top of page

13 సెప్టెంబరు 2025 శనివారము || పాపమును సమూలంగా నాశనం చేసి, వర్ధిల్లుటకు ప్రయత్నించుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 13
  • 1 min read

తేనెధారలు చదువుము : కార్య 13:6-11 


‘‘...సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషదానఫను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని...’’ - 1 పేతురు 2:1


ఆత్మీయంగా వర్ధిల్లుటకు బాల్యమునుండియే దేవుని వాక్యమును చదివి ధ్యానించవలెనని క్రైస్తవులమైన మనము బోధింపబడితిమి. అలాగు చేసిన తరువాత కూడ మనము ఎదగకుండ అక్కడే ఆగినట్లుండును. ఎట్టి అభివృద్ది ఉండదు. కారణమేమిటి  ఈదిన వాక్యభాగములో పేతురు ప్రత్యేకించి కొన్ని విషయాలను మన జీవితముల నుండి పూర్తిగా తోలగించుకొనవలెనని చెప్పుచున్నాడు. మనుష్యుని హృదయములో నుండి బయటకు వచ్చునవే అతనిని అపవిత్రపరుచునని మన ప్రభువైన యేసు స్పష్టముగా చెఉప్పుచున్నాడు.(మార్కు 7:21,22)


 మొదటిగా, సమస్త దుష్టత్వమును మనము విడిచిపెట్టవలెను. ఎఫెసీ 4:31లో పౌలు ‘‘సమస్తమైన ద్వేషము ,కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి’’ అని చెప్పుచున్నాడు. కొలస్సీ 3:8లోను ఇట్టి పాపాలు అనేకమైన వాటిని విసర్జించుమని చెప్పియున్నాడు. 1 కొరింధి 5:8లో దుష్టత్వమున, అల్లరిని ఆయన పులిపిండితో పోల్చుచున్నాడు. కొంచెము పులిపిండినైనను పిండికి కలిపితే అది ముద్ద అంతటిని పులియ చేయును. అలాగే, కొంచెము దుష్టత్వము హృదయంలో ఉన్నను మన ఆత్మీయ ఎదుగుదలను పాడుచేయును. రెండవదిగా, మనము మోసము చేయుటను విడిచి పెట్టవలెను. ఈ దిన వాక్యభాగంలో బర్యేసు అనువాని గూర్చి మనము చదువుము . అతడు అబద్ద ప్రవక్తjైుయుండి పౌలు అతనిని శపించినప్పుడు గ్రుడ్డివాడాయెను. అంతటి భయంకరమైన శిక్ష పొందునట్లు అతడేమి చేసెను. ఇతను కపటము, కుయుక్తితో వివేకము గలవాడైన సెర్గి పౌలును విశ్వాసము నుండి తోలగిపోవలెను అని పౌలు చెప్పుచున్నాడు. ప్రభువున యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండినప్పుడు వేషధారణతో నిండియుండిన పరిసయ్యులను గట్టిగా గద్దించెను. మత్తయి 6:2,5 లోను, 16లోను ఇచ్చుట, ప్రార్ధించుట, మరియు ఉపవాసమునున్నపుడును వేషధారణ వలె ఉండకూడదని ఆయన సూచించెను. అవును మిత్రులారా, మన ప్రభువైన యేసు, మరియు పేతురు, పౌలు గార్లు ఇచ్చిన గట్టి హెచ్చరికలకు మనము చెవియొగ్గుదము తద్వారా నిత్య మరణము నుండి తప్పించుకొందము.

ప్రార్ధన:` ప్రేమగల ప్రభువా, పాప స్వభావమునకు చెందిన సమస్తము నుండి తొలగిపోవునట్లు నాకు సహాయము చేయుము. ఎందుకంటే అవి నా ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకొనును. విమోచన దినము వరకు ఎవరిచేత ముద్రింపబడితినో ఆ పరిశుద్దాత్మను దు:ఖపరచక, జయ జీవితం జీవించునట్లు నాకవసరమైన నీ కృప దయచేయుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page