top of page

13, మార్చి 2025 గురువారము || శనివారము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Mar 13
  • 1 min read

చదువుము : 1 సమూ 2:1-10


శ్రమలో ఓర్పు కలిగియుండుము


‘‘ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును...’’ - సామె 19:11


‘‘... అహంకారము గల వానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు’’ - ప్రసంగి 7:8


సహనము అనేది ఒక సుగుణము. ఈ 21వ శతాబ్దములో దీనిని మనము దాదాపుగా చూడలేము. శ్రమలలో ఉన్నప్పుడు ఈ ఓర్పు కలిగియుండుట మరింత కష్టము. మన బాధనుండి త్వరగా విడుదల పొందవలెననియు, మన శ్రమలనుండి సులువైన మార్గములో తప్పింపబడవలెనని మనము కోరుదుము. అయితే శ్రమలలోను మనము ఓర్పు కలిగియుండవలెనని బైబిలు గట్టిగా చెప్పుచున్నది. ఎంతో సహించిన సమూయేలు తల్లిjైున హన్నాను గూర్చి ఈ దినవాక్యభాగము చెప్పుచున్నది. ఆమె వివిధమైన సమస్యలనెదుర్కొనినది. మొట్టమొదటిది, ఆమె గొడ్రాలు గనుక చాలామంది నుండి హేళన, అవమానముల నెదుర్కొనవలసి వచ్చెను. ఆ దినాలలో సంతానోత్పత్తిని బట్టియే ముఖ్యంగా స్త్రీలకు విలువనిచ్చేవారు. పిల్లలు కనని స్త్రీ తన భర్తకు తలంపులు తెచ్చేదిగా భావించేవారు. రెండవదిగా, ఆమెకుండిన శ్రమ, అవమానమునకు తోడు తన భర్తకు రెండవ భార్యjైున పెనిన్నా యొక్క వేధింపులు కూడా భరించవలసి వచ్చెను. హన్నాపట్ల ఎల్కానాకుండిన ప్రేమను బట్టి ఒకవేళ పెనిన్నా అసూయపడినదేమో. కానీ వీటన్నిటిని హన్నా ఓపికతో సహించినది. దీర్ఘకాలము ఆమె సహించినందునను అగ్ని పరీక్షలోను దేవునిని హత్తుకొని ఉండుటను బట్టి దేవుడామె హృదయవాంఛను తీర్చి బహుమానముగా సమూయేలు ఎంత గొప్ప పాఠము మనము నేర్చుకొనవచ్చునో కదా ! ఆమె జీవితంలో దేవుడు తన పని జరిగించునప్పుడు ఆమె ఎన్నడును చలించక దేవుని మీదనే ఎడతెగక ఆధారపడుచుండెను.


ప్రియ స్నేహితులారా, మీపై అపనిందలు మోపబడినవా ? మీ తప్పేమియు లేకుండనే ఇతరుల చేత అవమానించబడితిరా ? మీరు కృంగిపోయి, ఒంటరిjైుతిరా ? ధైర్యమును కోల్పోక దేవుని సమయం కొరకు వేచియుండుడి. ఆయన ఏ మాత్రము ఆలస్యము కానీ, ముందుగా కానీ ఏదియు చేయడు. తగిన కాలమందు, తన సమయమందు దేవుడు హన్నా ఓర్పుకు ప్రతిఫలమిచ్చెను. ఆయన మిమ్మును గూర్చి కూడా ఆలోచించుచున్నాడు. ఆయన తగిన కాలమందు మిమ్ము విడిపించి, ఘనపరచును.
ప్రార్ధన:- ప్రియమైన ప్రభువా, నీవు నా ప్రక్కనే ఉందువు గనుక ఎల్లవేళల నీవైపే చూచు కృపనిమ్ము. నీవు నా చెంతనే ఉన్నావని, ఏదియు నన్ను కదిలించలేదని నాకు నిశ్చయతనిమ్ము. ఎల్లప్పుడు నీ ఆలోచన, కాపుదల, సహాయమునందుకొని ధైర్యము కలిగియుండు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page