top of page

12, సెప్టెంబరు 2025 శుక్రవారము || క్రైస్తవుని మనసులో ద్వంద్వవైఖరికి చోటులేదు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 12
  • 1 min read

తేనెధారలు చదువుము : యోహాను 2:15-17


‘‘ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. - 1 యోహాను 2:15


దేవునితో మన సహవాసమును దెబ్బతీయు ప్రత్యేకమైన ఒక పాపమును గూర్చి యోహాను ఇక్కడ ఎత్తి చూపుచున్నాడు. అదియే లోకసంబంధమైన విషయాలు. ‘‘లోకమును ప్రేమింపకుడి’’ అని ఆయన చెప్పుచున్నాడు. దీనిని బట్టి ఆయన చెప్పునదేమనగా ఈ లోకములో ఉన్నదంతయు తాత్కాలికమైనదే గనుక వాటిపై ఆపేక్ష పెంచుకొనకుడు, అలా ప్రేమిస్తే నీవు బహుగా నిరాశ చెందుదువు. ఈ లోకము మనము కృతజ్ఞతతో అనుభవించుటకు దేవుడనుగ్రహించిన ఒక చక్కని మంచి ప్రదేశమే కానీ, అదియే నిత్యమైన ముగింపు కాదు, మన ఆత్మల నివాసము కూడ కాదు ‘‘ఇవన్నియు మంచివని చూచునట్లు దేవుని ఆత్మనిలో ఉండునుగాక, కానీ సృష్టికర్తను విడిచి సృష్టింపబడిన వాటిని ప్రేమించుదువేమో జాగ్రత్త’’  అని సెయింట్ అగస్టీన్ చెప్పిరి. ఉదా॥ ఒక పెండ్లి కుమారుడు తన పెండ్లికుమార్తె కొరకు డైమండ్ రింగ్ చేపించి ఇస్తే దానిని తీసుకొనిన ఆమె ఇచ్చిన పెండ్లి కుమారుని కంటే ఆ ఉంగరానే ఎక్కువగా ప్రేమిస్తే ఆ పెండ్లికుమారుని హృదయం బద్దలవదా? అలాగే ఈ లోకమునైనను దానిలో ఉన్నవాటినైనను ఎక్కవగా ప్రేమించినట్లయితే మన పెండ్లికుమారుడైన క్రీస్తుయేసును దు:ఖపరుచుదుము. (యాకోబు 4:4) మనము ఈ లోకస్తులను ప్రేమించకూడదని యోహాను ఇక్కడ చెప్పుటలేదని గమనించుడి. దేవుడు వారిని కల్వరిలో ప్రేమించినట్లే మనమును ప్రేమింపబద్దులము. ఈ లోకములో ఉన్నవారిని కలిగియుండుట తప్పు అని అతను చెప్పుటలేదు. సమస్య అంతయు మన ప్రేమ వాటి మీదకు మరలునప్పుడు దాని వలన దేవునికి దూరమై వేరుగా ప్రవర్తించుదుము.


 కావున ప్రియస్నేహితులారా ,మనము జాగ్రత్త కలిగియుందుము. ఎంపిక చేసుకొను అవకాశము మనకున్నది  తండ్రిని ప్రేమించుట లేదా,లోకమును ప్రేమించుట మనము దేనిని ఎంచుకొందుము  అన్నిటికన్న మిన్నగా దేవుని ప్రేమించుటనే కోరుకొందము. అదియే మన నుండి ప్రభువు కోరునది.

ప్రార్ధన:` ప్రియ ప్రభువా, నీ కొరకే నేను జీవించవలెనని కోరుచున్నాను. ఈ లోకము మరియు దానికి చెందినవేవియు నన్నాకర్షించకుండునట్లు నా కనుదృష్టి నీ మీదనే కేంద్రీకరించు కృపనిమ్ము. లోకమును అదే సమయంలో దేవుని ప్రేమించుట అసాధ్యము. కాబ్బటి నిన్నే ప్రేమించునట్లుగా హృదయము నింపబడు కృపనిమ్మని యేసునామమున అర్థించుచున్నాను తండ్రి, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page