top of page

12, మార్చి 2025 బుధవారము || శనివారము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Mar 12
  • 1 min read

చదువుము : జెకర్యా 8:1-23


దేవుడెంత కనికరము గలవాడో !


‘‘... శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను’’ - యిర్మియా 31:3


ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా తిరగబడి ఆయన దృష్టికి హేయమైన కార్యాలు చేసిరి. వారాయన ఆజ్ఞలకు అవిధేయులై ఆయన కోపము రేపిరి. అనేకసార్లు ఆయన తన ప్రవక్తలెందరినో పంపి వారిని హెచ్చరించినను, వారేమాత్రమును పశ్చాత్తాపపడక ఆయనకు విముఖులైరి. కాబట్టి దేవుడు వారిని వారి శత్రువులైన బబులోను వారికి అప్పగింపగా 70 సం॥లు వారక్కడ చెరపట్టబడియుండిరి ! అయితే దేవుని వారిని పూర్తిగా శిక్షించి వదిలిపెట్టలేదు. ఆయన కనికర సంపన్నుడు, క్షమించు దేవుడు. ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా కాలములో ఆయన ఆలయము పునర్నిర్మించుటకు వారిని తిరిగి వారిని తమ స్వదేశమునకు రప్పించి దీవించెను. వారి గత పాపాలన్నిటిని క్షమించి, వారి మధ్య నివసింతుననియు, ఆయన చేసిన నిబంధన ప్రకారము సమృద్ధితో దీవించెదనని వాగ్థానము చేసెను ! ‘‘ఒక మంచి తండ్రి’’కి రెండు విశిష్ఠ గుణలక్షణాలుండవలెను. క్రమశిక్షణలో స్థిరత్వము మరియు ధైర్యపరచుటకు సిద్ధముగా ఉండుట’’ అని సెల్విన్ హ్యూస్గారు చెప్పుచున్నారు. వీటిలో స్థిరత్వమను లక్షణము మాత్రమే దేవునికి ఉండునని కొందరనుకొందురు. అయితే తన పిల్లల కొరకు ఒక శ్రద్ధగల ప్రోత్సహించు ధైర్యపరచు ఒక ప్రేమగల తండ్రిగా ఆయనను ఈ అధ్యాయము చూపుచున్నది.


ప్రియ మిత్రులారా, మనమును ఇశ్రాయేలీయులవలె దేవునికి విరోధముగా తిరగబడి మన హృదయానుసారముగా ప్రవర్తించుదుము. ఆయన చేయు హెచ్చరికలకు చెవియొగ్గక ఉండుట చేత మన అతిక్రమమును బట్టి దేవుని చేత శిక్షింపబడుదుము గానీ ఎన్నటెన్నటికీ కాదు. మన పరమతండ్రి ఆయన ప్రేమ దయాదాక్షిణ్యము చొప్పున మనలను తిరిగి చేరదీసి ఆయనతో ఉండునట్లు మనలనుద్ధరించి దయగల హస్తాలతో మనలనాశీర్వ దించును గనుక మన హృదయాలను కఠినపరచుకొనక మన పాపమార్గముల నుండి మళ్ళుకొని ఆయన యొక్క నిబంధన సంబంధములోనికి ప్రవేశించుదము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నీవెంత ప్రేమ, కనికరముగల తండ్రివి ! ఒక తండ్రి తన పిల్లమీద కనికరపడినట్లు నీవు నాపై కనికరము చూపువాడవు. విరిగిన హృదయముతో నీవద్దకు వచ్చుచున్నాను దయతో నా తిరుగుబాటుతనమును క్షమించి నీ ప్రియ బిడ్డగా నన్ను అంగీకరించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page