top of page

12, ఏప్రిల్‌2025.శనివారము || యేసులో మనము ప్రార్దనా పాలి భాగస్తులమా ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Apr 12
  • 1 min read

తేనెధారలు చదువుము : లూకా22:39-46


‘‘తండ్రీ,యీగిన్నె నా మొద్దనుండి(తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము. అయినను నాయిష్టము కాదు,నీ చిత్తమే సిద్దించుసు గాక....’’ - లూకా22:42


ప్రభువైన యేసు మోసగింపబడక మునుపటి రాత్రి ఆయన పేతురా, యాకోబు, యోహనాలతో కలసి ప్రార్దించుటకు గెత్సేమనే తోటకు వేళ్ళెను. ఆయన దేవుని కుమారుడ్తెయుండి ఆయన అవమానింపబడునని, దూషింపబడునని, వేదన బాధననుభవించునని ముందే పూర్తిగా ఎరిగి యుండెను. ఆయన ఆత్మ ఎంతో వేదననుభవించెను. ‘‘నా ఆత్మ మరణమనునంతగా వేదనపడుచున్నది ‘‘అని ఆయన చేప్పెను. ఈ మానవాళి కోరకు తానే పాపముగా చేయబడి తన తండ్రినుండి వేరుపరచబడునని ఆయన ఎరిగియుండి, ఈ అనుభవమును ‘‘పాత్రలోనిది త్రాగుట ‘‘గా చేప్పెను. ఈ పాత్రను గూర్చి ఆయన మూడుసార్లు శిష్యుల వద్దకు తిరిగివచ్చి వారు నిద్రించుచుండుటను చూచెను. వారిముందు ఉండిన పరీక్ష, అపాయము ఏమాత్రము గ్రహించనివారిగా ఉండిరి అని సువార్తలలో చెప్పబడినది.


ఆయన చెమట  నేలనుపడుచున్న రక్త బిందువుల వలె ఉండెనని లూకా గారు చెప్పిరి, వైద్య శాస్త్రా ప్రకారము ఇది హెమాట్తెడ్రాసిస్‌ ‘‘అను అరుద్తెన శారీరకస్ధితిగా అబివర్ణించును. ఇది ఎంతో మానసిక ఒత్తిడిలో స్వేదగ్రంధులలో ఉండు రక్తకణాలు చితికిపోయి రక్తము, చెమట కలిపి బయటకువచ్చును. ఆయన వేదనను చూచిన ఒక దేవదూత ఆయనను బలపరచుటకు పరలోకము నుంవి దిగివచ్చెను. అయితే ఆయన శిష్యులలో ఏ ఒక్కరు కూడ ఇట్టి వేదనాభరితమైన ఘడియలో ఆయనతో లేరు. ప్రియమిత్రులారా, మీ భారమును పంచుకొనుటకు ఏ ఒక్కరు లేని స్థితిలో మీరు ఒక్కరే ప్రార్థనలో పోరాడుచున్నారా ? కృంగిపోవద్దు. పరిశుద్ధాత్మ మీ కొరకు మీతో కలిసి విజ్ఞాపన చేయుచున్నాడు, అంతేకాదు యేసుక్రీస్తే మీ కొరకు తండ్రికి విన్నపము చేయుచున్నాడు. ధైర్యము కలిగి పరిస్థితిని ఎదుర్కొనుడి. ప్రభువు మిమ్ము బలపరచును గనుక మీ సమస్యలనుండి విజయవంతముగా బయటకు వచ్చెదరు.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, తోటలో యేసుప్రభువు తన శిష్యుల చేత మరువబడి ఎంత ఒంటరితన మనుభవించెనో కదా. దేవా, నా పక్షాన ఇప్పుడు యేసే నీకు విజ్ఞాపన చేయుచున్నాడని నేనిక ఒంటరిని కాదని నేనెంతో ధైర్యపరచబడితిని. నేనును సంపూర్ణముగా నీకు అప్పగించుకొను చున్నాను. నా మొఱ్ఱ ఆలకించి నన్ను రక్షించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page