top of page

12, ఆగపు 2025 మంగళవారం || కాండ మీది-లోయలాని అనుభవాలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 12
  • 2 min read

తేనెధారలు చదువుము : మార్కుఠ9:2-20



“అప్పుడు పేతురు : బోధకుదా, మనమిక్కడ ఉండుట మంచిది” ... అని యేసుతో చెప్పెను. - మార్కు 9:5



కొండపైని మరియు లోయలోని ఒక గొప్ప అనుభవమును మనమిక్కడ చూన్తాము. యేసుతో సన్నిహితంగా ఉందు శిష్యులైన పేతురు, యాకోబు మరియు యోహానులు ప్రభుయేసునందు దేవుని మహిమను చూచిరి. ఇది ఎవరును ఎన్నడు ఎరుగనంత గొప్ప ఉన్నతమైన ఆత్మీయానుభవమైయుండెను. ఆయన బాహ్యరూపమునకు నరుడ్రైయుండినను ఆయన దేవుడు అని వారు గ్రహించియుండిరి. అక్కడ జరిగిన రూపాంతరము అని నిస్సందేహమైనదని బుజువు చేసెను. వారు కొండ దిగి, లోయప్రాంతానికి వచ్చి మిగిలిన తొమ్మిదిమంది శిష్యులతో కలిసికొనబోవుచుండగా శిష్యులు ఎన్నడు చూడనంత అత్యంత వైఫల్యమును రుచిచూచిరి. ఇది మోషే సీనాయి కొండ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు పూజించుటకు వారు చేసికొనిన బంగారు దూడను మరియు వారి విగ్రహారాధనను ఎదుర్శొనిన మోషే అనుభవము వలెనే యున్నది. (క్రయ స్నేహితులారా, మన ఆత్మ బలపదుటకును, ఆత్మను తిరిగి పునరుజ్జీవింప

జేసికొనుటకును అప్పుడప్పుడు ఆ కొండమీది అద్భుత అనుభవాలు అవసరమైయున్నవి. అయినను మనమక్కడే ఉండిపోవాలని దెవుడు కోరుకొనుట లేదు. లోయలోని నిజస్థితికి దిగిరావాలని ఆయన మనలను కోరుచున్నాడు. పేతురైతే ఆ కొండమీదనే ఉండిపోవాలని కోరాడు (మార్కు 9:5. కానీ యేసు మాత్రము వారు కొందదిగి తిరిగి ఇతర శిష్యులతో కలిసికొని వారు యెరూషలేముకు వెళ్ళి తన పని పూర్తిచేయుటకు సిలువకు వెళ్ళక ముందే అవసరతలో ఉన్నవారికి పరిచర్య చేయుటకు నడిపించవలెనని కోరెను. అపవిత్రాత్మతో పీడింపబడిన బాలుని స్వస్ట్థపరచిన సంఘటన రూపాంతర అనుభవము తరువాత వారు దిగివచ్చిన వెనువెంటనే జరిగినది. ఈ రెండు సంఘటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నవి. కొందమీద రూపాంతరమునందు మహిమ ఉండగా క్రింద లోయలో శ్రమ కనబడుచున్నది. రూపాంతరము దేవుని చేత చేయబడగా క్రింద లోయలో సాతాను ఏలుచున్న అధికారంగా ఉండను. ప్రజల వాస్తవస్థితిని గమనించి, పాప, (శమలతో సతమతమగుచున్నవారికి పరిచర్య చేయునట్లు వారికొరకు బ్రదుకవలెననియు ఆయన మనలను కోరుచున్నాడు. వునము నువార్త బోధించి, బాధలలో ఉన్నవారికి వరిచర్య చేయవలెననుకొనుచున్నాడు. ఆయన పక్షాన ప్రేమను చూపువారముగా ఆయన నామము పేరట, తన సన్నిధి మనతో వచ్చునను వాగ్ధానము చేపట్టి వెళ్ళుటకు ఇష్టపడుదము.

ప్రార్దన:- ప్రియ ప్రభువా, నీ సన్నిధిలో ఉండుటకు, నీ సౌందర్యమును చూచుచు, నీ సమాధానమును రుచి చూడవలెననుదియే నాకున్న గొప్ప ఆశయ్రైయున్నది. నేనా స్టితిలోనే నిత్యము ఉండవలెననుకొనక పాపముతోను, శ్రమలతోను ఉన్న ప్రజలవద్దకు కొందమీదినుండి లోయలోనికి దిగి వారిని సాతాను శక్తినుండి విడిపించు కృపననుగ్రహించుమని యేసునామమున స్తుతించు చున్నాను తండ్రి, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page